Sam:బాలీవుడ్ భాయ్‌తో టాలీవుడ్ సామ్.. క్రేజీ కాంబినేషన్

Sam :సల్మాన్, సమంత కలిసి ఇప్పటివరకు నటించలేదు.. కాబట్టి ఈ కాంబో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు.

Sam

సమంత రూత్ ప్రభు.. ఈ పేరుకు సౌత్ ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి మళ్లీ స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఈ స్టార్ హీరోయిన్ జతకట్టబోతోందనే వార్త ఫిల్మ్ నగర్‌లో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

సల్లూ భాయ్ , సామ్(Sam) కాంబినేషన్‌లో ఒక భారీ సూపర్ హీరో సినిమా రాబోతున్నట్లు సమాచారం. సల్మాన్, సమంత కలిసి ఇప్పటివరకు నటించలేదు.. కాబట్టి ఈ కాంబో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు.

ది ఫ్యామిలీ మెన్, ఫర్జీ వంటి సంచలన సిరీస్‌లతో గుర్తింపు పొందిన రాజ్ నిడిమోరు అండ్ కృష్ణ డీ.కే ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే సమంతతో కలిసి ‘ది ఫ్యామిలీ మెన్ 2’ కోసం పని చేసిన ఈ ద్వయం, ఆమె యాక్షన్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు.

యాక్షన్ అండ్ హ్యూమర్ కలగలిసిన ఈ సూపర్ హీరో సినిమాలో.. హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే ఈ రూల్‌కు సమంత అయితేనే న్యాయం చేయగలదని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు సల్మాన్ ఖాన్ కూడా తన కెరీర్‌లో మొదటిసారి ఒక పూర్తి స్థాయి సూపర్ హీరో రోల్‌లో కనిపించబోతున్నాడు.

Sam

కాగా చైతూతో విడాకుల తర్వాత అనారోగ్య సమస్యల వల్ల కొంతకాలం మూవీలకు దూరంగా ఉంది. కాగా సమంత, రెండో పెళ్లి చేసుకున్నాక సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటూ ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీ మే 15న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

1980ల నాటి క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో సమంత(Sam) యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని టాక్ నడుస్తోంది. దీనితో పాటు సామ్ రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాకు కూడా సామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె కెరీర్ మళ్లీ జోష్‌ఫుల్‌గా మారుతోంది. అయితే సల్లూభాయ్,సామ్ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version