Ustad Bhagat Singh
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh ) ప్రమోషన్ల వేగం పుంజుకుంది. రిలీజ్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ స్పీడ్ పెంచారు. ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేలా సర్ఫ్రైయిజ్ లు ప్లాన్ చేశారు.
నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే ఒక సంచలనం అని చెప్పాలి. దానికి తోడు ఇప్పుడు మూడో సాంగ్ కూడా తోడవడంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఒకెత్తయితే, ఇప్పుడు వస్తున్న ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అనే సాంగ్ ఊరమాస్ బీట్‌తో థియేటర్లను షేక్ చేయడం ఖాయం అంటూ పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ ట్యూన్ ప్రోమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలేసేలా చేస్తోంది. మార్చి 10న విడుదలైన ప్రోమోలో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, ఆ స్టైల్ చూస్తుంటే మళ్లీ గబ్బర్ సింగ్ రోజులు గుర్తొస్తున్నాయంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కేవలం 50 సెకన్ల ప్రోమోనే ఇంత రచ్చ చేస్తే, మార్చి 12 సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోయే ఫుల్ సాంగ్ ఇంకెంత గత్తర లేపుతుందోనని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లలో మరింత దూకుడు పెంచడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఉగాది కానుకగా మార్చి 19న పవన్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి ఎటువంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికేట్ లభించడం మరో ప్లస్ అయ్యింది.
2 గంటల 34 నిమిషాల రన్ టైమ్‌తో పక్కా మాస్ ప్యాకేజీలా రెడీ అయిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh )లో , పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సరికొత్తగా కనిపించబోతున్నారు. తగ్గేదేముంది, నెగ్గేదాకా తిక్కే ఉండాలి అంటూ సాగే లిరిక్స్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో మూవీపై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. మరికొద్ది రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడో చూడాలి మరి.
