Trisha movie
తమిళ సినీ ఇండస్ట్రీతో పాటు తమిళ రాజకీయాల్లోనూ ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్, త్రిషల గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం, ఇప్పుడు ఆమె నటించిన సినిమా(Trisha movie)కు విజయ్ సర్కార్ నుంచి అదిరిపోయే సపోర్ట్ లభించడం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది.
సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కరుప్పు’ సినిమా మే 14న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ సినిమా ‘వీరభద్రుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తోంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ విషయంలో సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు రిలీజ్ రోజు ఉదయం 9 గంటల షోలకు పర్మిషన్ ఇస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
గతంలో డీఎంకె ప్రభుత్వ హయాంలో ఎర్లీ మార్నింగ్ షోలు, బెనిఫిట్ షోల విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. కొన్ని స్పెషల్ సినిమాలకు తప్ప, మిగిలిన వాటికి మార్నింగ్ 11 గంటల షోలకే పర్మిషన్ ఉండేది. కానీ విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక , త్రిష నటించిన సినిమా(Trisha movie)కు ఇలా ఎక్స్‌ట్రా షోలు ,ఎర్లీ షోలకు పర్మిషన్ ఇవ్వడం కోలీవుడ్‌లో కొత్త యాంగిల్‌ను చూపిస్తోంది. దీంతో విజయ్, త్రిష మధ్య ఉన్న స్నేహ బంధం వల్లే ఈ వెసులుబాటు కలిగిందా అనే చర్చలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాక సీఎం చంద్రబాబు సహకారంతో సినిమా ఇండస్ట్రీకి ఎలా అయితే అండగా ఉంటూ పర్మిషన్స్ ఇస్తున్నారో, తమిళనాడులో విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నారని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజయ్ కూడా సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో, ఇకపై సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయని కోలీవుడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Special thanks to our honorable Chief Minister Thiru. Joseph Vijay for granting the special permission for the 9AM shows of #Karuppu.#Karuppu – FDFS begins at 9AM, from May 14th🔥
A @SaiAbhyankkar Musical 🎵@Suriya_offl @trishtrashers @RJ_Balaji @dop_gkvishnu @prabhu_sr… pic.twitter.com/6sLumAcAFr
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 12, 2026
