Alzheimer
మనిషి శరీరంలో అత్యంత సంక్లిష్టమైనది మెదడు. అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరులో చాలా ఎక్కువ మార్పులు వస్తుంటాయి. దీనివల్ల మనిషి ఫేస్ చేసే ఇబ్బందుల్లో అల్జీమర్స్ మొదటిది అనే చెప్పొచు.
అల్జీమర్స్(Alzheimer) అనేది మెదడు కణాలను మెల్లగా క్షీణింపజేసి, జ్ఞాపకశక్తిని, ఆలోచనా శక్తిని, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యాన్ని మెల్లగా హరించే న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్. వైద్య రంగానికి సవాల్ విసురుతున్న ఈ అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి.. సైన్స్ ప్రపంచంలో తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఓ అద్భుతమైన ముందడుగు పడింది
నిజానికి మనల్ని చేతుల్లో పెంచిన కన్నతల్లో లేదా దశాబ్దాలుగా తోడున్న భాగస్వామో.. ఒక్కసారిగా మన కళ్లలోకి చూసి నువ్వు ఎవరివని అడిగితే ఎలా ఉంటుంది. ఇదే అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులలో తరచూ ఎదురయ్యే సమస్య. అల్జీమర్స్ అంటే కేవలం ఏదో వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోయే సాధారణ మతిమరుపు కానే కాదు.
అది ఆ మనిషి నుంచి వారి జ్ఞాపకాలను, అనుబంధాలను, భావోద్వేగాలను, చివరకు అతడి సొంత ఉనికిని కూడా ముక్కలు ముక్కలుగా నరికేసే ఒక రాక్షస వ్యాధి. ఈ వ్యాధి తెచ్చే బాధ అది ఫేస్ చేసే బాధితుడి కంటే, వారిని కంటికి రెప్పలా చూసుకునే కుటుంబ సభ్యులపైనే దారుణమైన నరకాన్ని చూపించినట్లు అవుతుంది.య
అల్జీమర్స్ బారిన పడినవారికి మెదడులోని నాడీ కణాలు మెల్లగా చనిపోతుంటాయి. మొదట్లో నిన్న ఏం తిన్నారో మర్చిపోవడంతో స్టార్ట్ అయి, మెల్లగా సొంత ఇల్లు, అయినవారి పేర్లు, రోజూ నడిచి వెళ్లే రూట్స్ కూడా మర్చిపోతారు. వ్యాధి ముదిరే కొద్దీ తినడం, నీళ్లు మింగడం, కనీసం ఎదుటివారి టచ్‌ను గుర్తించడం కూడా మెదడుకు గుర్తుండదు.
పెరాలసిస్ వస్తే శరీరం మాత్రమే చచ్చు పడిపోతుంది.. కానీ అల్జీమర్స్ వస్తే మనిషి బ్రతికుండగానే జీవచ్ఛవంలా మారిపోతాడు. మనసు ఉండి మాట్లాడలేక, కళ్లముందే సొంత మనుషులున్నా కూడా గుర్తుపట్టలేక ఆ బాధితులు పడే వేదనను ఎవరూ మాటల్లో చెప్పలేం. అయితే వారిని ఆ స్థితిలో చూస్తూ ఏమీ చేయలేక ఇంట్లోవాళ్లు పడే బాధ అయితే ఇక అసలే వివరించలేం. ఇప్పటివరకు కూడా ఈ మహమ్మారిని పూర్తిగా నయం చేసే మెడిసిన్ లేకపోవడం ఇంకా విషాదం.
ఇలాంటి భయంకరమైన అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి ఇంటర్నేషన్ మెడికల్ సైన్స్‌లో అద్భుతమైన ఆశల కిరణం మెరిసింది. దశాబ్దాలుగా భారత దేశంలో అప్పుడే పుట్టిన పిల్లలలో టీబీ నివారణకు ఇచ్చే సాధారణ ‘బీసీజీ’ (BCG) వ్యాక్సిన్.. మైండ్‌లోని రోగనిరోధక వ్యవస్థను రీ-ట్రైన్ చేసి అల్జీమర్స్‌పై పోరాడేలా చేస్తుందని సైంటిస్టులు కనుగొన్నారు.
ప్రపంచ ప్రసిద్ధ నేచర్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఈ రీసెర్చ్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ బాధితుల కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 55 ఏళ్లు దాటిన వ్యక్తులపై పరిశోధకులు ఒక సంవత్సరం పాటు ప్రత్యేక క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వయసు పైబడటం వల్ల రోగనిరోధక శక్తి క్షీణించి మైండ్‌లో మంట ఏర్పడటమే ఈ వ్యాధికి ప్రధాన కారణమని గుర్తించిన శాస్త్రవేత్తలు.. బాధితులకు ఒక నెల గ్యాప్‌లో 2 సార్లు బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలించారు. వారి బ్లడ్, స్పైనల్ ఫ్లూయిడ్ నమూనాలను పరీక్షించగా మైండ్ బ్లోయింగ్ ఫలితాలు వెలువడ్డాయి.
ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వారి మైండ్‌లోని ఇమ్యూనిటీ కణాలు విశేషంగా యాక్టివేట్ అయ్యి, అల్జీమర్స్(Alzheimer)కి కారణమయ్యే అమిలాయిడ్ బీటా అనే హానికరమైన ప్రొటీన్ గడ్డలను మెల్లగా తగ్గించినట్లు తేలింది. మెదడుపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించకుండా, రోగనిరోధక వ్యవస్థను బ్యాలెన్స్ చేస్తూ మెదడును కాపాడటంతో ఈ టీకా అద్భుతంగా పనిచేస్తోందని తేలింది. అయితే ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న పరిశోధన మాత్రమేనని, క్లినికల్ ట్రయల్ అన్నీ పూర్తిగా ముగిశాకే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
Family Register Certificate : త్వరలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్.. ఇది ఎందుకు? ఎవరికి ఉపయోగం?
