The Paradise
మూవీకి ప్రమోషనల్ ట్రైలర్ ఏమాత్రం అవసరం లేదు..కంటెంట్‌పై నమ్మకం ఉంటే బాక్సాఫీస్ దానంతట అదే షేక్ అవుతుందని నేచురల్ స్టార్ నాని నిరూపిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ రేంజ్‌లో క్యూరియాసిటీని పెంచేస్తున్న యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్(The Paradise) మూవీ థియేటర్లలోకి రావడానికి డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి ట్రేడ్ వర్గాల్లో ఒక్కసారిగా పూనకాలు వచ్చేసాయి.
సెప్టెంబర్ 24వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్న ది ప్యారడైజ్(The Paradise) మూవీ, ఒక్క రోజు ముందే ఓవర్సీస్ రచ్చను స్టార్ట్ చేయబోతోంది. నార్త్ అమెరికా బుకింగ్స్ విండో ఓపెన్ చేసిన మరుక్షణం నుంచే కలెక్షన్ల సునామీ కురుస్తుండటంతో నాని నయా మూవీ సత్తా ఏంటో అందరికీ ప్రూవ్ అయింది.
టికెట్ల సేల్ స్టార్ట్ అయిన అతి కొద్ది గంటల్లోనే 100K డాలర్ల క్లబ్‌లోకి దూసుకెళ్లి, యూఎస్ మార్కెట్‌లో ఈ స్పీడ్‌ను సాధించిన మోస్ట్ క్రేజీయెస్ట్ తెలుగు మూవీగా రికార్డు నమోదు చేసింది. ఈ మూవీకి ఉన్న హైప్ మధ్యలో కాస్త సైలెంట్ అయినట్లు అనిపించినా, రిలీజ్ సమయం దగ్గర పడటంతో అక్కడ కౌంటర్లు కిక్కిరిసిపోతున్నాయి.
ఓవర్సీస్ పంపిణీదారులు లేటేస్ట్‌గా రివీల్ చేసిన డేటా ప్రకారం.. అమెరికాలో ప్రీమియర్ కాన్సెప్ట్ కోసమే ఏకంగా 15,000కు పైగా టిక్కెట్లు క్షణాల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో ప్రీ-సేల్స్‌తోనే సుమారు 350K డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల్లో రూ. 3.35 కోట్లు జేబులో వేసుకోవడంతో మేకర్స్ రిలాక్స్ అయిపోయారు.
ఈ మూవీలో నాని జడల్ అనే చాలా ఇంటెన్స్, వైల్డ్ రా పాత్రలో న్యూ గెటప్‌తో మెప్పించబోతున్నాడు. ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఏషనాగుల సాంగ్ కేవలం 17 రోజుల తేడాలోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్‌తో డిజిటల్ స్పేస్‌ను దడదడలాడించిన విషయం తెలిసిందే.
ది ప్యారడైజ్ మేకర్స్ ఇప్పటివరకు చిన్న ట్రైలర్‌ను కూడా ఆడియన్స్ ముందుకు వదల్లేదు. పబ్లిసిటీ హంగామా కూడా ఏమాత్రం లేకుండా, కంటెంట్‌పై ఉన్న పూర్తి కాన్ఫిడెన్స్‌తో డైరెక్ట్‌గా ఇలా థియేటర్ల బాట పట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
నాని ట్రైలర్ కట్ కూడా చూడకుండానే ఓవర్సీస్ ఆడియన్స్ ఈ రేంజ్‌లో టికెట్లను నరికేస్తున్నారంటే.. ఇక సెప్టెంబర్ 24వ తేదీన ఫస్ట్ డే ఫస్ట్ షో పడగానే ఏ రేంజ్‌లో విధ్వంసం క్రియేట్ చేస్తుందోనన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోయింది.
JADAL TAKE OVER 🔥🔥#ThePARADISE North America Premieres Pre-Sales 15,000+ Tickets Sold and counting 💥💥
Overseas By @PrathyangiraUS, Premieres On SEP 23 👊@NameisNani @Odela_Srikanth @AnirudhOfficial @SudhakarCheruk5 @SLVCinemasOffl pic.twitter.com/OSzyYaSW1c
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 17, 2026
https://twitter.com/PrathyangiraUS/status/2100341344187396545
Isabgol : ఇసబ్‌గోల్ గురించి ఎప్పుడైనా విన్నారా? చిన్న టీస్పూన్ పొడితో ఎన్నో అద్భుతాలు
