Eating
మనం పగలంతా ఏం తిన్నా పర్వాలేదు. అయితే రాత్రి పడుకునే ముందు తీసుకునే ఆహారం(Eating) మాత్రం ఆరోగ్యాన్ని, నిద్రను శాసిస్తుంది. చాలామంది తెలీక హెల్దీ ఫుడ్ అనుకుంటూ.. కొన్ని పదార్థాలను రాత్రి పూట తీసుకుంటారు. కానీ అవి బాడీకి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తాయి.
ముఖ్యంగా రాత్రి సమయంలో కర్డ్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం.. రాత్రి పూట కర్డ్ తీసుకోవడం వల్ల శరీరంలో కఫం పెరిగి.. శ్వాసకోస సమస్యలు, జలుబు, దగ్గు వంటివి వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా పెరుగు జీర్ణవ్యవస్థను మందగింపజేసి పొట్ట ఉబ్బరంగా ఉండేలా చేస్తుంది.
దీంతో పాటు కాఫీ, టీల వంటి కెఫీన్ ఉండే డ్రింక్స్‌ను రాత్రి పూట తీసుకోకుండా ఉండటం చాలా అవసరం. అంటే నిద్రపోవడానికి కనీసం ఐదు గంటల ముందే వీటికి దూరంగా ఉండాలి.
ఎందుకంటే కాఫీ, టీలలో ఉండే కెఫీన్ మెదడును ఎక్కువ సేపు మేల్కొనేలా చేస్తుంది. దీనివల్ల మీరు గాఢ నిద్రకు దూరమై మర్నాడు నీరసంగా కనిపిస్తారు.
అలాగే రాత్రి పూట అతిగా మసాలాలున్న, స్పైసీ ఆహారం (Eating) తినడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుంటాయి. ఇవి కూడా మీ నిద్రను పదే పదే భంగం కలిగిస్తాయి.
వీటన్నిటికి బదులుగా రాత్రి పూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగే పద్ధతిని అలవాటు చేసుకోండి. పాలలోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్.. మీ మెదడును ప్రశాంత పరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించి త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది.
అంతేకాదు రాత్రి పూట చేసే భోజనాన్ని నిద్రపోయే మూడు గంటల ముందే ముగిస్తే.. మీ మెటబాలిజం మెరుగుపడి బరువు తగ్గడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది.
