Coconut Flower :కొబ్బరి పువ్వు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? మహిళలకు అది సంజీవిని అట..

Coconut Flower : కొబ్బరి పువ్వులో సహజ పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

Coconut Flower

కొబ్బరి నీళ్లు, కొబ్బరి పీచు గురించి మనందరికీ తెలుసు కానీ, ముదిరిన కొబ్బరికాయ లోపల ఏర్పడే ఈ కొబ్బరి పువ్వు గురించి చాలామందికి తెలీదు. అయితే ఈ పువ్వులో ఎన్ని పోషకాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేవలం టేస్ట్ కోసమే కాకుండా, ఒక గొప్ప ఔషధంగా కూడా కొబ్బరి పువ్వును వాడతారు.

కొబ్బరి పువ్వులో నేచురల్ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలోని రోగనిరోధక శక్తిని (Immunity) చాలా బాగా పెంచుతాయి. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది ఒక మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో కూడా కొబ్బరి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పువ్వు ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.

జీర్ణకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా కొబ్బరి పువ్వు(Coconut Flower) ఎంతో మేలు చేస్తుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం , కడుపులో అల్సర్లు (Ulcers) వంటి సమస్యలను ఇది నేచురల్‌గానే తగ్గిస్తుంది. శరీరంలోని ఎక్కువ వేడిని తొలగించి, బాడీని కూల్ చేస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం (Fiber) వెయిట్ తగ్గాలనుకునే వారికి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Coconut Flower

ముఖ్యంగా మహిళల హెల్త్ విషయానికి వస్తే, కొబ్బరి పువ్వు(Coconut Flower)ను ఒక బెస్ట్ మెడిసిన్‌గా చెప్పుకోవచ్చు. చాలామంది స్త్రీలు ఎదుర్కొనే హార్మోన్ల అసమతుల్యతను (Hormonal Imbalance) ఇది సరిచేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే ప్రాబ్లెమ్స్‌ తగ్గించడమే కాకుండా, బ్లడ్‌ను క్లీన్ చేయడంలో కూడా దీనికి సాటి లేదు. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి, మొటిమలు , డ్రై స్కిన్ వంటి సమస్యల నుంచి రిలీఫ్ పొందడానికి కొబ్బరి పువ్వును డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఎప్పుడూ నీర్సంగా ,అలసటగా అనిపిస్తే.. వారు ఈ పువ్వును తీసుకోవడం వల్ల వెంటనే శక్తిని పొందుతారు.నేచురల్‌గా పోషకాలు డైరెక్టుగా శరీరానికి అందుతాయి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రకృతి సిద్ధంగా లభించే ఇటువంటి ఆహారాలను డైలీ రొటీన్‌లో భాగం చేసుకుంటే , అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటూ పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు.

Urinary Tract Infection:ముప్పుగా మారుతున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్..మహిళల్లో ఎందుకు ఎక్కువగా వస్తుంది?

Exit mobile version