Onion :ఉల్లిపాయే కదా అని లైట్ తీసుకోకండి..ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Onion : ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయ తినడం వెనుక ఎన్నో బలమైన శాస్త్రీయ కారణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.

Onion

వేసవి కాలంలో శరీరాన్ని కూల్‌ను చేసుకోవడానికి రకరకాల ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు, గ్లూకోజ్ నీళ్లు తాగుతుంటాం. అయితే వీటన్నిటికంటే మన వంటగదిలో ఎప్పుడూ సిద్ధంగా ఉండే ‘ఉల్లిపాయ'(Onion) ఎండాకాలంలో ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సమ్మర్‌లో ఉల్లిపాయను కూరల్లో వండుకుని తినడం కంటే కూడా పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల బాడీకి గరిష్ట స్థాయిలో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం లంచ్ సమయంలో పచ్చి ఉల్లిపాయ ముక్కలపై కొద్దిగా నిమ్మరసం, కొంచెం ఉప్పు చల్లుకుని తింటే ఎన్నో అద్భుతమైన లాభాలుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్లు చెప్పే చిట్కా మాత్రమే కాదు.. ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయ(Onion) తినడం వెనుక ఎన్నో బలమైన శాస్త్రీయ కారణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.

నేటి తరం వారు ఉల్లిపాయను కేవలం కూరలకు రుచినిచ్చే ముక్కలుగానే చూస్తారు. కానీ ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల మన శరీరానికి ఐదు రకాల ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి.

మొదటిది, ఎండదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది. వేసవి కాలంలో మనల్ని వేధించే అతిపెద్ద ప్రమాదం ఎండదెబ్బ తగలడం. ఉల్లిపాయలో ఉండే సహజసిద్ధమైన కెమికల్స్ బాడీ టెంపరేచర్‌ను ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఇది సమ్మర్‌లో వీచే ‘లూ’ అని పిలవబడే వేడి గాలుల ప్రభావాన్ని తగ్గించి, ఎండదెబ్బ తగలకుండా బాడీని ఒక కవచంలా కాపాడుతుంది.

రెండోది, పచ్చి ఉల్లిపాయ బాడీని నేచురల్‌గా చల్లబరుస్తుంది. ఉల్లిపాయకు శరీరాన్ని లోపల నుంచి చల్లబరిచే గుణం చాలా ఎక్కువగా ఉంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు బాడీని హైడ్రేట్‌గా ఉంచే ముఖ్యమైన పోషకాలుంటాయి. ఎండ తీవ్రత వల్ల బాడీలో ఆటోమేటిక్‌గా పెరిగిపోయే వేడిని తొలగించడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే పూర్వం చద్ది అన్నంలో ఉల్లిపాయ నంజుకుని తిని ప్రయాణాలు చేయడం, పొలం పనులకు వెళ్లడం వంటివి చేసేవారు.

మూడోది, జీర్ణక్రియను పచ్చి ఉల్లిపాయ ఎంతో మెరుగుపరుస్తుంది. సాధారణంగా సమ్మర్‌లో బాడీలో నీటి శాతం తగ్గి జీర్ణవ్యవస్థ కాస్త మందగిస్తుంది. దీనివల్ల తిన్న ఫుడ్ సరిగ్గా అరగకపోవడం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి పొట్ట సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. పచ్చి ఉల్లిపాయలో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది.

నాలుగోది, పచ్చి ఉల్లిపాయ(Onion) శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లిపాయలో విటమిన్-సి అలాగే యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి సమ్మర్‌లో వాతావరణ మార్పుల వల్ల వచ్చే వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, వడదెబ్బ వల్ల వచ్చే జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మన బాడీలో ఇమ్యూనిటీని బాగా స్ట్రాంగ్ చేస్తాయి.

Onion

ఐదోది గుండె ఆరోగ్యం , షుగర్ కంట్రోల్‌కు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే ఒక ప్రత్యేకమైన ఫ్లేవనాయిడ్ బీపీని కంట్రోల్ చేయడంలో అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అంతేకాదు పచ్చి ఉల్లిపాయ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, బ్లడ్ షుగర్ ను కంట్రోల్‌లో ఉంచడానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఈ వేసవిలో ప్రతిరోజూ మీ డైలీ మెనూలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉండేలా చూసుకోండి.

Peddi Movie : పెద్ది మూవీ రిలీజ్‌కు లైన్ క్లియర్.. థియేటర్ల వివాదానికి చెక్ పెట్టిన మెగాస్టార్

Exit mobile version