EPFO : ఉమాంగ్ యాప్,పోర్టల్ తిప్పలకు చెక్.. వాట్సాప్‌లోనే ఈపీఎఫ్ఓ ఆల్ ఇన్ వన్ సర్వీసులు ..
EPFO : ఈపీఎఫ్ఓ చందాదారుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. 8796441800 నెంబర్‌తో వాట్సాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు.
EPFO
ఉద్యోగస్తులకు తమ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది.. ఈ మంత్ ఎంత కట్ అయింది వంట వివరాలు తెలుసుకోవాలన్నా లేదంటే పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. గంటల తరబడి సైట్ ఓపెన్ కాకపోవడం, ఉమాంగ్ యాప్‌లో సర్వర్ డౌన్ అంటూ వచ్చే ఎర్రర్లు రావడంతో..వాటి విసిగిపోయిన పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు మోదీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
ఇకపై పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ఎవరూ కూడా ఏ పోర్టల్‌కి వెళ్లకుండా, ఏ యాప్ ఓపెన్ చేయకుండానే డైలీ వాడే వాట్సాప్ నుంచే అన్ని సేవలను పొందేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఢిల్లీలో తాజాగా జరిగిన 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీ ఈ వాట్సాప్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. పీఎఫ్ రికార్డుల్లో లింక్ అయి ఉన్న మీ మొబైల్ నెంబర్ నుంచి సింపుల్‌గా ఒక హాయ్ అని మెసేజ్ కొడితే చాలు, పీఎఫ్ సేవలన్నీ మీ ముందు వాలిపోతాయి.
ఈ కొత్త నిర్ణయంతో ఖాతాదారులకు వెబ్‌సైట్ల చుట్టూ తిరిగే తిప్పలు పూర్తిగా తప్పినట్లేనని చెప్పుకోవాలి. మీ ఫోన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్‌ను క్షణాల్లో తెలుసుకోవాలంటే ముందుగా మీ కాంటాక్ట్స్‌లో 87964 41800 అనే నెంబర్‌ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని టెక్స్ట్ పంపాలి.
వెంటనే మీ లాంగ్వేజ్‌ను ఎంచుకోమని మెసేజ్ వస్తుంది. దానిలో మీకు కావలసిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే పీఎఫ్ బ్యాలెన్స్, లాస్ట్ 5 ట్రాన్జాక్షన్లు, పాస్‌బుక్ డౌన్‌లోడ్ వంటి కొన్ని రకాల ఆప్షన్లు స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. అక్కడ మనకు కావాలసిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఉదాహరణకు పీఎఫ్(EPFO) బ్యాలెన్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వాట్సాప్‌లో ఎంటర్ చేయగానే మీ కంపెనీ వేసిన వాటా, మీరు దాచుకున్న డబ్బులు, పెన్షన్ అమౌంట్ ఎంత ఉందో ప్రతీదీ కూడా పూసగుచ్చినట్లు టెక్స్ట్ రూపంలో వచ్చేస్తుంది.
అంతేకాకుండా మీకు పీఎఫ్(EPFO) పాస్‌బుక్ కావాలనుకుంటే మళ్లీ మెనూలోకి వెళ్లి ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఓటీపీ కొడితే చాలు, పీడీఎఫ్ ఫైల్ డైరెక్టుగా మీ వాట్సాప్‌కే వచ్చేస్తుంది. ఫైల్ ఓపెన్ చేయడానికి మీ పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా నమోదు చేస్తే మొత్తం మీ డిటైయిల్స్ అన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి.
What Women Want In A Man : మీలో ఈ లక్షణాలున్నాయా? అయితే మిమ్మల్ని ఏ అమ్మాయి కూడా వదులుకోదు..





