Quit Smoking : స్మోకింగ్ మానేసినా ముప్పు తప్పదా? మరి ఎప్పుడు మానేస్తే లంగ్స్‌ సేఫ్‌గా ఉంటాయి?

Quit Smoking : స్మోకింగ్ ఆపేసిన కొద్ది గంటల్లోనే రక్తంలో ఉండే డేంజరస్ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ పడిపోతాయి. హార్ట్ బీట్ నార్మల్ అయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఊపందుకుంటుంది.

Quit Smoking

సిగరెట్ తాగడం ఆపేశాం..ఇక ఊపిరితిత్తులు వాటంతట అవే క్లీన్ అయిపోతాయని చాలామంది అనుకుంటారు. అయితే మనిషి లంగ్స్ లోపల జరిగే జన్యుపరమైన మైండ్ గేమ్‌ని ఇటీవల సైంటిస్టులు డికోడ్ చేసిన తర్వాత అసలు నిజం వెలుగులోకి వచ్చింది. స్మోకింగ్ మానేసిన(Quit Smoking) కొద్ది రోజులకే శ్వాస తేలికవుతుంది. ఇది నిజమే అయినా ఏళ్ల తరబడి పొగ పీల్చడం వల్ల దెబ్బతిన్న కొన్ని కణాలు మాత్రం ఇంకా లోపల అలాగే ఉండి సైలెంట్‌గా తమ రూపాన్ని మార్చుకుంటూనే ఉంటాయట.

ఈ రీసెర్చ్ కోసం ప్రస్తుతం సెగరెట్ తాగుతున్న వారితో పాటు గతంలోనే ఆపేసినవారు అలాగే అసలు లైఫ్‌లో ఎప్పుడూ స్మోక్ చేయని వారి లంగ్స్ టిష్యూలను రీసెర్చర్స్ అడ్వాన్స్‌డ్ జెనెటిక్ టెక్నాలజీతో సింగిల్ సెల్ లెవెల్‌లో మైక్రోస్కోపిక్‌గా అనలైజ్ చేయగా.. మైండ్ బ్లాకింగ్ విషయాలు తెలిసాయి. స్మోకింగ్ మానేసిన చేసిన తర్వాత లంగ్స్‌లోని కొన్ని రకాల సెల్స్ మెల్లగా కోలుకుని పాత హెల్దీ స్టేజ్‌కి చేరుకుంటున్నాయి.

కానీ, సెల్యులార్ రిపేర్, శరీరంలో వచ్చే ఇన్‌ఫ్లమేషన్ ప్రాసెస్ , ఇమ్యూనిటీ సిస్టమ్ పవర్ , బ్లడ్ వెసెల్స్ హెల్త్‌ని కంట్రోల్ చేసే కీలకమైన జన్యువులలో (DNA) స్మోక్ వల్ల వచ్చిన పెద్ద పెద్ద మార్పులు మాత్రం అలాగే ఉండిపోతున్నట్లు తేలింది. స్మోకింగ్ ఆపేసి ఏళ్లు గడుస్తున్నా కూడా కొంతమందిని ఊపిరితిత్తుల వ్యాధులు ఎందుకు వెంటాడుతున్నాయో చెప్పడానికి ఈ జన్యు మార్పులే మెయిన్ రీజన్ అని రీసెర్చర్స్ తేల్చారు.

సిగరెట్ స్మోక్‌లో ఉండే వేలాది డేంజరస్ కెమికల్ సెల్స్ డీఎన్‌ఏని డ్యామేజ్ చేస్తాయి. స్మోకింగ్ ఆపేయగానే(Quit Smoking) కెమికల్ దాడి తగ్గినా కూడా, అప్పటికే కణజాలంలో ఏర్పడిన శాశ్వత మచ్చలు (Scars) లేదా గాలి గదులు దెబ్బతినడం వంటి సమస్యలు మళ్లీ అంతకుముందులా సాధారణ స్థితికి రాలేవు. అందుకే పొగ మానేసిన కొంతమందిలో కూడా ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ మార్పుల వల్లే లంగ్స్ రిపేర్ మెకానిజమ్ దెబ్బతిని ఫ్యూచర్‌లో సీఓపీడీ (COPD), మ్యాక్ లంగ్ డిసీజ్ (MAC Lung Disease) , ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ వంటి ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టే పెద్ద రోగాలు వచ్చే ముప్పు పొంచి ఉంటుంది.

Quit Smoking

అయితే ఇక్కడ ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే నిజం కూడా ఉందని రీసెర్చర్స్ తేల్చారు. స్మోకింగ్ ఆపేసిన కొద్ది గంటల్లోనే రక్తంలో ఉండే డేంజరస్ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ పడిపోతాయి. హార్ట్ బీట్ నార్మల్ అయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఊపందుకుంటుంది. కొన్ని వారాల్లోనే లంగ్స్‌లోని జిగురు ద్రవాన్ని, వేస్ట్ పార్టికల్స్‌ని బయటకు నెట్టే సీలియా సిస్టం మళ్లీ యాక్టివ్ అయి దగ్గు కూడా తగ్గుతుంది.

గాలి గదులు పూర్తిగా పాడవకముందే ఏ ఏజ్‌లో స్మోకింగ్ మానేసినా(Quit Smoking) కూడా లంగ్ కెపాసిటీ వేగంగా పుంజుకుంటుంది. హార్ట్ అటాక్, పెరాలసిస్, క్యాన్సర్ల రిస్క్ తగ్గి ఆయుష్షు కూడా పెరుగుతుంది. మెయిన్‌గా వీరి వల్ల ఇంట్లో వాళ్లు సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ బారిన పడకుండా ఉంటారు. కాబట్టి పొగ తాగే అలవాటును వీలైనంత త్వరగా మానేయడంతో పాటు, మానేశాక కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే.. లంగ్స్‌కు అసలైన రక్షణ ఇచ్చినవారవుతారు.

Plastic Notes : కాగితపు నోట్లకు గుడ్ బై..రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లతో ఆర్‌బీఐ ప్రయోగం..

↑
Exit mobile version