Sugar
మన లైఫ్ స్టైల్‌లో అందరికీ పంచదార ఒక భాగమైపోయింది. మార్నింగ్ లేచింది మొదలు టీ, కాఫీ, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇలా రకరకాలుగా రోజూ టన్నుల కొద్దీ షుగర్(Sugar) మన బాడీలోకి వెళ్తూనే ఉంటుంది. అందుకే చాలామంది బరువు తగ్గడానికి , ఫిట్‌గా ఉండటానికి నో షుగర్ ఛాలెంజ్ అంటూ వన్ మంత్ పాటు షుగర్‌ను పూర్తిగా మానేస్తున్నారు.
నిజంగానే నెల రోజుల పాటు షుగర్‌ను పూర్తిగా పక్కన పెడితే మన బాడీలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని డాక్టర్లు అంటున్నారు. మొదటి వారం రోజులు కొంచెం కష్టంగా అనిపించినా.. ఆ తర్వాత బాడీ కొత్త ఎనర్జీని పుంజుకుంటుంది.
షుగర్(Sugar) మానేయడం వల్ల బ్లడ్‌లో ఇన్సులిన్ స్థాయిలు కంట్రోల్‌లోకి వస్తాయి. దీంతో లివర్‌పై ఒత్తిడి తగ్గి, గుండె జబ్బులు వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు స్కిన్‌పై ముడతలు తగ్గి కాంతివంతమవుతుంది. అలాగే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇక వీరికి నైట్ టైమ్‌లో నిద్ర కూడా చాలా ప్రశాంతంగా పడుతుంది.
షుగర్‌లో కేవలం ఖాళీ క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వీటి వల్ల బాడీకి ఎలాంటి పోషకాలు అందవు సరి కదా, ఫ్యాట్ రూపంలో పేరుకుపోతాయి. ఎప్పుడైతే మనం పంచదార ఆపేస్తామో, అప్పుడు శరీరంలోకి క్యాలరీల ఇన్‌టేక్ అకస్మాత్తుగా పడిపోతుంది. దీనివల్ల బాడీలో పేరుకుపోయిన పాత ఫ్యాట్ కరగడం మొదలై, కేవలం 4 వారాల్లోనే కంటికి కనిపించేలా బరువు తగ్గుతారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ చాలా ఫాస్టుగా కరుగుతుంది.
చాలామంది షుగర్(Sugar) కంప్లీట్‌గా మానేసినా కూడా బరువు తగ్గరు. ఎందుకంటే మనం ఇంట్లో వాడే వైట్ షుగర్‌ను మానేస్తాం కానీ, మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ రూపంలో తెలియకుండానే బాడీలోకి హిడెన్ షుగర్ వెళ్తూనే ఉంటుంది. మనం హెల్దీ అనుకుని తాగే ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్‌లు, సాస్‌లు, ఫ్లేవర్డ్ పెరుగు, బిస్కెట్లు, బ్రెడ్ వంటి వాటిలో విపరీతమైన షుగర్ దాగి ఉంటుంది. వాటిని తింటూ ఉంటే షుగర్ మానేసినా ఎలాంటి ఫలితం ఉండదు.
అలాగే పంచదార మానేశాం కదా అని కొందరు రైస్, బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్, నూనె పదార్థాలు ఎక్కువగా తినేస్తుంటారు. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు కూడా శరీరంలోకి వెళ్లాక గ్లూకోజ్‌లాగే మారతాయి. శరీరం వెయిట్ అనేది కేవలం పంచదార మీదనే కాదు.. రోజంతా మనం తీసుకునే టోటల్ క్యాలరీల మీద ఆధారపడి ఉంటుంది.
పంచదార మానేసినా మిగతా ఫుడ్ ద్వారా ఎక్కువ క్యాలరీలు బాడీలోకి వస్తుంటే వెయిట్ అస్సలు తగ్గరు. వీటికి తోడు హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్, పిసిఓడి వంటి సమస్యలు, తగినంత నిద్ర లేకపోవడం, విపరీతమైన మెంటల్ టెన్షన్స్ వంటివి కూడా బరువు తగ్గకుండా అడ్డుపడుతుంటాయి.
కాబట్టి నెల రోజుల పాటు పంచదార మానేసేటప్పుడు కేవలం షుగర్‌నే కాకుండా.. ఇంట్లో వండే వైట్ రైస్ క్వాంటిటీని తగ్గించడంతో పాటు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వాటి స్థానంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.
దీంతో పాటు రోజుకు కనీసం 30 – 40 నిమిషాల పాటు వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేస్తూ ఉండాలి. అలాగే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోతేనే అనుకున్నట్లుగా బరువు తగ్గి, సూపర్ ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.
