Persimmons:సూపర్ ఫ్రూట్ టెండూ గురించి తెలుసా? ఏంటి దీని స్పెషాలిటీ?

Persimmons: డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే భయంతో పండ్లను తినడానికి భయపడతారు.

Persimmons

ఇప్పుడు ఎక్కడ చూసినా జనాల్లో హెల్త్ కాన్షియస్‌నెస్ బాగా పెరిగినట్లే కనిపిస్తోంది. ప్రజలు తమ లైఫ్‌స్టైల్ , ఫుడ్ హ్యాబిట్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కేవలం రుచి కోసం కాకుండా, బాడీకి మేలు చేసే క్వాలిటీ ఫుడ్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వేయడం లేదు. ఈ సమయంలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒక ఫ్రూట్ నేమ్ తెగ వైరల్ అవుతోంది.

టెండూ పండుగా పిలిచే ఈ పర్సిమ్మన్స్ (Persimmons) ను ఇండియాస్ నెక్స్ట్ సూపర్ ఫ్రూట్‌గా చెబుతున్నారు. మెడికల్ ఎక్స్‌పర్ట్స్ దీనిని ఒక పవర్‌ఫుల్ సూపర్ ఫుడ్‌గా అంటున్నారు. ఈ పర్సిమ్మన్స్ పండు పోషకాలకు ఒక కేరాఫ్ అడ్రస్ లాంటిది. ఇందులో విటమిన్ ఏ, సి, ఇ , కె వంటి అత్యవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

వీటితో పాటు బాడీ ఫంక్షనింగ్‌కి కావలసిన పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి మినరల్స్ కూడా దీనిలో ఎక్కువగా లభిస్తాయి. మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదాని ప్రకారం, ఈ పర్సిమ్మన్స్ లో సాల్యుబుల్ (కరిగే) , ఇన్‌సాల్యుబుల్ (కరగని) ఫైబర్ అరుదైన కాంబినేషన్‌లో ఉంటుంది. ఇది బాడీలో మైక్రో న్యూట్రియెంట్స్‌ను అందిస్తూనే, మన మెటబాలిజంను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడానికి సాయం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నాచురల్‌గా హై లెవెల్ న్యూట్రిషన్ ఇచ్చే కెపాసిటీ ఈ పండుకు ఉంది.

ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు , కార్డియాక్ అరెస్ట్ సమస్యలు విపరీతంగా పెరుగుతున్న సమయంలో, ఈ పండు హార్ట్ హెల్త్‌కు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉండే కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ మన బ్లడ్ వెస్సల్స్ ను (రక్తనాళాలను) శుభ్రంగా ఉంచుతాయి. ఇవి బాడీలోని ఎల్‌డీఎల్ (LDL – చెడు కొలెస్ట్రాల్) లెవెల్స్‌ను తగ్గించి, బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్‌లో ఉంచుతాయి. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ డైట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

Persimmons

సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే భయంతో పండ్లను తినడానికి భయపడతారు. కానీ పర్సిమ్మన్స్ పండులో ఉండే హై ఫైబర్ కంటెంట్ వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా స్పైక్ అవ్వకుండా నిరోధించబడతాయి. అందుకే దీనిని ఒక ‘మెటబాలిక్ ఫ్రెండ్లీ’ ఫ్రూట్‌గా డాక్టర్లు రికమెండ్ చేస్తున్నారు.

అలాగే దీనిలో ఉండే టానిన్లు, పాలీఫెనాల్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తూ బాడీలోని అంతర్గత వాపులను తగ్గిస్తాయి. అయితే దీనిని లిమిట్‌గా తీసుకోవాలి, లేదంటే కాన్‌స్టిపేషన్ (మలబద్ధకం) వచ్చే ఛాన్స్ ఉంటుంది.

Vitamin B12 : విటమిన్ బి12 లోపం..సైలెంట్ కిల్లర్ అని తెలుసుకోండి..

Exit mobile version