Vitamin C : జామకాయ,ఆరెంజ్‌లో విటమిన్ సీ దేనిలో ఎక్కువ? ఈ రెండింటిలో అసలైన విన్నర్ ఎవరు?

Vitamin C : అసలు మన శరీరానికి విటమిన్ సీ ఎందుకంత ముఖ్యం అనే కారణాలను డాక్టర్లు వివరిస్తున్నారు. చాలామంది విటమిన్ సీ కేవలం జలుబు, దగ్గు రాకుండా మాత్రమే చూస్తుందని అనుకుంటారని.. కానీ దీని పాత్ర చాలా పెద్దదని డాక్టర్లు అంటున్నారు.

Vitamin C

బాడీలో రోగనిరోధక శక్తి అమాంతం పెరగాలన్నా, చర్మం కాంతివంతంగా మెరవాలన్నా విటమిన్ సీ చేసే హెల్ప్‌ అంతా ఇంతా కాదు. ఈ విటమిన్ పేరు చెప్పగానే చాలామంది నారింజ పండ్లలో ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ మన చుట్టుపక్కల చాలా సాధారణంగా, అతి తక్కువ ధరకే లభించే జామకాయ.. నారింజ కంటే చాలా శక్తివంతమైనదని డాక్టర్లు అంటున్నారు.

అసలు మన శరీరానికి విటమిన్ సీ(Vitamin C) ఎందుకంత ముఖ్యం అనే కారణాలను డాక్టర్లు వివరిస్తున్నారు. చాలామంది విటమిన్ సీ కేవలం జలుబు, దగ్గు రాకుండా మాత్రమే చూస్తుందని అనుకుంటారని.. కానీ దీని పాత్ర చాలా పెద్దదని డాక్టర్లు అంటున్నారు. విటమిన్ సీ శరీరంలో ఇమ్యూనిటీని స్ట్రాంగ్‌ చేసి, రకరకాల ఇన్‌ఫెక్షన్లపై పోరాడటమే కాకుండా.. చర్మం ఎప్పుడూ యంగ్‌గా ఉండటానికి, ఎముకల బలానికి అవసరమయ్యే కొల్లాజెన్‌ను ప్రొడ్యూస్ చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

సాధారణంగా నారింజ పండును సీ విటమిన్‌కి(Vitamin C) కేరాఫ్ అడ్రస్‌గా భావిస్తారు. ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూడటంలో ది బెస్ట్‌ ఫ్రూట్ ఇదే. అంతేకాకుండా నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్లు, పొటాషియం వంటి మూలకాలు బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని తొక్క తీయడం ఈజీ కాబట్టి ప్రయాణాల్లో కూడా స్నాక్‌గా తినడానికి ఇది వీలుగా ఉంటుంది.

ఇక జామకాయ సంగతి తీసుకుంటే.. మనం లైట్ తీసుకునే ఈ కాయ అసలైన పోషకాల గని అని చెప్పాలి. ఇందులో పీచు పదార్థం (ఫైబర్) విపరీతంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగి మలబద్ధకం వంటి సమస్యలు రావు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా యాంటీ ఏజింగ్ గుణాల్లా పనిచేస్తాయి. వాతావరణం మారినప్పుడు వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఇది మన బాడీని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది.

Vitamin C

ఇక అసలైన పోటీ విషయానికి వస్తే.. అమెరికా వ్యవసాయ శాఖ (USDA) డేటా ప్రకారం ఈ రెండింటి మధ్య విటమిన్ సీ వ్యత్యాసం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. 100 గ్రాముల నారింజలో సుమారు 53 మిల్లీగ్రాముల విటమిన్ సీ మాత్రమే ఉండగా.. అదే 100 గ్రాముల జామకాయలో ఏకంగా 228 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది.

అంటే జామకాయలో నారింజ కంటే కూడా ఏకంగా నాలుగు రెట్లకు పైగా విటమిన్ సీ దాగి ఉందన్నమాట. దీని ప్రకారం మన శరీరానికి డైలీ కావలసిన విటమిన్ సీ ని అందుకోవడానికి ఒక్క జామకాయ తింటే సరిపోతుంది. అదే నారింజ పండ్లు అయితే నాలుగైదు తినాల్సి వస్తుంది. కాబట్టి రేటు తక్కువగా ఉందని జామకాయను అస్సలు తక్కువ అంచనా వేయకుండా డైలీ ఒకటి అయినా తినండి.

Blueberries : జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫ్రూట్..బ్రెయిన్ పవర్, ఇమ్యూనిటీని ఒకేసారి పెరగాలంటే డైలీ తినాల్సిందే

Exit mobile version