Water
చాలామంది వెయిట్ తగ్గుతామంటూ ఉదయాన్నే లేవగానే లీటర్ల కొద్దీ గోరువెచ్చని నీరు(Water )తాగుతారు. ఎందుకంటే వేడి నీళ్లు తాగితే ఒంట్లో ఫ్యాట్ కరిగిపోయి బరువు తగ్గుతారనే నమ్మకం చాలా మందిలో బలంగా ఉంటుంది.
అయితే ఈ విషయంలో మనందరికీ తెలియని ఎన్నో నిజాలను న్యూట్రిషనిస్టులు, ఆరోగ్య నిపుణులు బయటపెడుతున్నారు. కేవలం వేడి నీళ్లు(Water) తాగడం వల్లే బరువు తగ్గుతారనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి హాట్ వాటర్ కంటే కూల్ వాటరే బరువు తగ్గడానికి కాస్త ఎక్కువగా హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వెయిట్‌లాస్ జర్నీలో ఉన్నప్పుడు బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలను, టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి నీళ్లు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. అయితే ఈ సమయంలో చాలామంది హాట్ వాటర్ తాగుతారు. కానీ వేడి నీటికి బదులు కూల్ వాటర్ తాగినప్పుడు శరీరంలో ‘థర్మోజెనిసిస్’ అనే ఒక వింత ప్రక్రియ జరుగుతుంది.
చల్లటి నీళ్లు పొట్టలోకి వెళ్లగానే.. మన బాడీ ఆ నీటిని తన సొంత ఉష్ణోగ్రతకు సమానంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెస్ లో శరీరం ఎక్కువ కష్టపడాల్సి రావడంతో కొన్ని అదనపు కేలరీలు ఆటోమేటిక్‌గా బర్న్ అవడంతో మెటబాలిజం రేటు కొద్దిగా పెరుగుతుంది.
అంతేకాదు, ఆకలి వేసినట్లు అనిపించినప్పుడల్లా.. ఒక గ్లాసు కూల్ వాటర్(Water) తాగితే కడుపు నిండినట్లు అనిపించి ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేరు. అదే గోరువెచ్చని నీళ్లు తాగితే లోపల ఉన్న ఆహారం త్వరగా జీర్ణమైపోవడంతో, మళ్లీ వెంటనే ఆకలి వేసే అవకాశం ఉంటుంది.
ఇక వ్యాయామాలు , వర్కౌట్లు చేసే వాళ్లకు కూడా కూల్ వాటరే బెస్ట్ ఆప్షన్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు ఒళ్లు బాగా హీటెక్కుతుంది. ఆ సమయంలో కూల్ వాటర్ తాగడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్‌లోకి వస్తుంది. దీనివల్ల త్వరగా అలసిపోకుండా.. ఎక్కువ సేపు వర్కౌట్ చేయడానికి వీలవుతుంది.
అదే వేడి వాతావరణంలో గోరువెచ్చని నీళ్లు తాగితే దాహం తీరినట్లుగా ఉండదు. అలా అని ఎక్కువ వాటర్ తాగితే కడుపు భారంగా మారడంతో వర్కౌట్లు చేయడం కష్టమవుతుంది. అయితే అలా అని వేడి నీళ్లు మంచివి కావని అర్థం కాదు. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, గ్యాస్ , మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉండటానికి గోరువెచ్చని నీళ్లు బాగానే హెల్ప్ చేస్తాయి.
చివరగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నదేంటంటే.. కేవలం నీళ్లు తాగే విధానాన్ని మార్చేసినంత మాత్రాన బరువు తగ్గిపోరు. కూల్ వాటర్ బరువు తగ్గడానికి కాస్త సపోర్ట్ ఇస్తుందే తప్ప, వెయిట్ తగ్గడానికి అదే మార్గం కాదు.
మంచి రిజల్ట్ కావాలనుకునే వాళ్లెప్పుడూ కూడా సరైన బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటూ, రోజూ కాస్త బాడీకి శ్రమ ఇచ్చేలా వర్కౌట్లు చేయాలి. అలాగే దాంతో పాటు బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి సరిపడా నీళ్లు తాగడాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన పద్ధతిలో త్వరగా వెయిట్ తగ్గుతారు.
Thailand : భారతీయులకు థాయ్ ప్రభుత్వం షాక్..కొత్త వీసా రూల్స్ ప్రకటన
