America : అమెరికాను వదలని గన్ కల్చర్..ముగ్గురి మృతితో మరోసారి ఉలిక్కిపడ్డ అగ్రరాజ్యం

America : భోజనం చేయడానికి వచ్చే సాధారణ కస్టమర్‌లా వచ్చిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది.

America

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ మరోసారి విరుచుకుపడింది. ఇదాహోలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

వీకెండ్ కావడంతో రెస్టారెంట్‌లో రద్దీ ఎక్కువగానే ఉంది. భోజనం చేయడానికి వచ్చే సాధారణ కస్టమర్‌లా వచ్చిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది.

ఘటన జరిగిన కొద్ది సమయంలోనే పోలీసులు అక్కడకు చేసుకున్నారు. దుండగుడు తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో దుండగుడు కూడా మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.

America

గాయపడినవారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి గురించి ఆరా తీస్తున్నట్టు చెప్పారు. కాల్పులు జరపడానికి కారణాలు ఇంకా తెలియలేదని, దర్యాపు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఈ ఘటనలో నిందితుడి చనిపోయినా ముందస్తు చర్యలలో భాగంగా చుట్టూ ఉన్న పరిసరాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దగ్గరలో ఉన్న రోడ్లు మూసేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గత నెలలో సియాటిల్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోగా, ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.

Vijay Mallya : భారత్‌కు ఝలక్ లండన్‌లో రాయల్ లైఫ్.. విజయ్ మాల్యా బిజినెస్ సామ్రాజ్యాన్ని ముంచేసిన ఆ ఒక్క తప్పు ఏంటి?

Exit mobile version