Artemis 2 : క్షేమంగా ల్యాండయిన ఆర్టెమిస్‌-2…మానవసహిత చంద్రుడి మిషన్ సక్సెస్

Artemis 2 : సుమారు యాభై ఏళ్ల తర్వాత చంద్రుడిపై చేసిన మానవసహిత మిషన్ విజయవంతంగా ముగిసింది

Artemis 2

సుమారు యాభై ఏళ్ల తర్వాత చంద్రుడిపై చేసిన మానవసహిత మిషన్ విజయవంతంగా ముగిసింది. చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్‌-2(Artemis 2) బృందం తిరిగి క్షేమంగా భూమిపైకి అడుగుపెట్టింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుఝామున ఫసిఫిక్ మహాసముద్రం తీరంలో ఒరాయన్ క్యాప్సూల్ దిగింది. దాని నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా తిరిగివచ్చారు.

దీంతో ఉత్కంఠ రేకెత్తించిన 10 రోజుల మిషన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. భూమి నుంచి ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యోమగాములుగా ఆర్టెమిస్‌-2 బృందం చరిత్రలో నిలిచిపోయింది.ఈ యాత్రలో ముగ్గురు అమెరికన్లు, ఓ కెనడియన్ ఇప్పటి వరకూ మానవులు చూడని చంద్రుడి అవతల వైపుకు వెళ్లి చూసి వచ్చారు. వీరంతా భూమి నుంచి 4 లక్షల కిలోమీటర్ల ప్రయాణించారు. వ్యోమగాములు ఈ యాత్రలో చంద్రుడి పై నుంచే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు.

ఇదిలా ఉంటే భూవాతావరణంలోకి వ్యోమనౌక ధ్వనికంటే 33 రెట్లు వేగంతో ప్రవేశించింది. గతంలో నాసా చేపట్టిన అపోలో మిషన్ల తర్వాత వ్యోమనౌక ఈ స్థాయి వేగంతో రావడం ఇదే తొలిసారి. నిజానికి ల్యాండింగ్ సమయంలో కాసేపు గందరగోళపరిస్థితి నెలకొంది. భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఏర్పడిన వేడికి కమ్యూనికేషన్ కు తీవ్ర అంతరాయం కలిగింది.

ఒకదశలో దాదాపుగా తెగిపోయిందని కూడా భయపడ్డారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ పెరిగిపోవడంతో అంతా టెన్షన్ పడ్డారు. చివరికి క్షేమంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గతంలో అపోలో 13 నెలకొల్పిన రికార్డును ఆర్టెమిస్‌-2(Artemis 2) బ్రేక్ చేసింది. అంతరిక్షంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణం చేసిన బృందంగా రికార్డులకెక్కింది.

Artemis 2

1972లో చేపట్టిన అపోలో యాత్ర తర్వాత మానవులు చంద్రుడిపైకి వెళ్లి తిరిగి రావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 1న ఒరాయన్ వ్యోమనౌకలో భూమి నుంచి బయలుదేరి వెళ్లిన వ్యోమగాములు 24 గంటల పాటు భూకక్ష్యలో గడిపారు. అనంతరం నాసా ట్రాన్స్‌లూనార్‌ ఇగ్నిషన్‌ను చేపట్టింది. ఇక్కడ నుంచి చంద్రుడి దిశగా ముందుకెళ్లింది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యోమనౌకలో వారికి పలు సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని అంశాలు ఇబ్బందిపెట్టినా వ్యోమగాములు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసారు. కాగా ఆర్టెమిస్‌-2 విజయవంతమవడంతో ఆర్టెమిస్‌-4 మిషన్ కు మార్గం సుగమమైంది.

Mangli : రూ.10 కోట్ల మోసం…మంగ్లీపై క్రిమినల్ కేసు నమోదు

Exit mobile version