China
కీలక రంగాల్లో అగ్రస్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్న అమెరికా, చైనా దేశాల మధ్య టెక్ వార్ తారాస్థాయికి చేరింది. ఒకదేశంపై మరో దేశం ప్రతీకారచర్యలకు దిగుతున్నాయి. తమ దేశానికి చెందిన టెక్ దిగ్గజ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని చైనా తప్పుపట్టింది. దీనికి ప్రతీకారచర్యలను కూడా మొదలుపెట్టింది.
అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రతీకార చర్యల్లో భాగంగా చైనా రక్షణ రంగానికి చెందిన అనుబంధ కంపెనీలపై తాము కూడా ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు కొన్ని పెద్ద అమెరికా సంస్థల నుంచి కొనుగోళ్ళు ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ట్రంప్ ఇటీవలే చైనాలో పర్యటించారు.
అప్పుడు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు బలపడ్డాయంటూ స్టేట్ మెంట్ కూడ ఇచ్చారు. ఈ పర్యటన జరిగి నెలరోజులైనా కాకముందే ఇప్పుడు ఒకరి కంపెనీలపై ఒకరు ఆంక్షలు విధించుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.ఈ ఆంక్షలు రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని చైనా(China) వాణిజ్య మంత్రిత్వశాఖ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరోస్థాయికి చేరేలా కనిపిస్తోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయంలో చైనా కాస్త దూకుడుగానే వ్యవహరిస్తోంది. మిలిటరీ డ్రోన్ తయారీ, అరుదైన ఖనిజాల మైనింగ్‌లో ఉన్న అమెరికన్ కంపెనీలకు ఉపయోగపడే వస్తువులను ఎగుమతి చేయొద్దంటూ ఇప్పటికే తమ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇతర దేశాల నుంచి కూడా ఈ వస్తువులు అగ్రదేశానికి చేరకుండా రూల్స్ పెట్టింది.
ఈ పరిస్థితికి అమెరికా తీరే కారణమని డ్రాగన్ దేశం చెబుతోంది. చైనా టెక్ దిగ్గజాలు అలీబాబా, బైదూ వంటి వాటికి అక్కడి సైన్యంతో సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా అనుమానిస్తోంది. ఇదే కారణంతో అమెరికా రక్షణ శాఖ వాటిని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ కారణంగానే ఆ కంపెనీలకు సైనిక కాంట్రాక్టులు దక్కలేదు.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా అమెరికా ఆరోపణలను ఖండించింది. అటు దిగ్గజ టెక్ కంపెనీలు కూడా అమెరికా ఆరోపణలను తప్పుపట్టాయి. తమకు చైనా(China) సైన్యంతో ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటన కూడా చేసాయి. ఈ జాబితాలో అవియాక్స్ ,టియల్ డ్రోన్స్, రెడ్ క్యాట్ హోల్డింగ్స్ జయా రోబోటిక్స్ వంటి కంపెనీలున్నాయి.
Numerology : నెంబర్ 3 వారి మైండ్ సెట్..వీరితో పెట్టుకుంటే అంతే సంగతులు!
