Balcony
మార్నింగ్ లేవగానే కాఫీ కప్పు చేతపట్టుకుని, మనసారా ఆస్వాదిస్తూ కాసేపు ప్రశాంతంగా కూర్చోవడానికి మీ ఇంట్లో బెస్ట్ స్పాట్ ఏదని ఎవరినైనా అనడిగితే.. ఒకప్పుడు హాల్, బెడ్‌రూమ్ ఇలా ఏదొక పేరు చెప్పేవారు. కానీ, ఇప్పుడు వారి సమాధానం పూర్తిగా మారిపోయింది.
మోడర్న్ సిటీ లైఫ్‌లో బాల్కనీ(Balcony) అనేది కేవలం బట్టలు ఆరేసుకోవడానికి, పనికిరాని పాత సామాన్లు పడేయడానికి ఉండే ప్లేస్ అన్న ఒపీనియన్ మారిపోయింది. కాంక్రీట్ గూళ్లలో నివసించే ఇండియన్స్ ఇప్పుడు తమ ఇంట్లోని చిన్న బాల్కనీలను ఒక లగ్జరీ స్కై లాంజ్‌గా, మైండ్ రిలాక్స్ అయ్యే గ్రీనరీ ప్లేస్‌లా తీర్చిదిద్దుకుంటున్నారు. అపార్ట్‌మెంట్ కల్చర్ విపరీతంగా పెరిగిన మన సిటీలలో, మెంటల్ రిలాక్సేషన్ కోసం ప్రజలు ఎంచుకుంటున్న ఈ బాల్కనీ మేకోవర్ ఇప్పుడు హోమ్ ఇంటీరియర్స్ వరల్డ్‌లోనే ఒక సరికొత్త విప్లవానికి బాటలు వేసింది.
ఈ మోడరన్ ఇంటీరియర్ డిజైన్లలో ఇండోర్, అవుట్‌డోర్ అనే లైన్స్ పూర్తిగా చెరిగిపోతున్నాయి. లివింగ్ రూమ్ నుంచి బాల్కనీకి వెళ్లే దారిలో పెద్ద పెద్ద గ్లాస్ స్లైడింగ్ విండోస్ అమర్చి, రెండింటికీ ఒకే లాంటి ఫ్లోరింగ్ ఇస్తున్నారు. దీనివల్ల ఇల్లు విశాలంగా కనిపించడమే కాక, పగటిపూట వచ్చే లైటింగ్ ఇల్లంతా పరుచుకుంటుంది.
అలాగే ప్లాస్టిక్ వస్తువుల ప్లేస్‌లో టేకు చెక్క, కేన్, వికర్ వంటి నేచురల్ మెటీరియల్స్‌తో చేసిన ఫర్నిచర్ వాడుతున్నారు. గోడలకు నేచురల్ టెక్చర్డ్ కలర్స్, ఎల్‌ఈడీ డిమ్ లైట్లు, హ్యాంగింగ్ లాంతర్లు పెడుతున్నారు. దీని వల్ల సాయంత్రం కాగానే ఆ చిన్న స్పేస్ ఒక రాయల్ కేఫ్‌లా మారిపోతోంది.
కొంతమంది టెక్కీలు అయితే రోజంతా స్క్రీన్ల ముందు కూర్చుని అలసిపోతుండటంతో .. గాలి, వెలుతురు వచ్చేలా ఫోల్డబుల్ డెస్క్‌లు అమర్చుకుని వర్క్ చేసుకుంటున్నారు. మరికొందరు తమ టేస్ట్‌కి తగ్గట్టు వర్టికల్ గార్డెన్స్, ఆర్గానిక్ ప్లాంటర్స్‌తో యోగా కార్నర్స్ క్రియేట్ చేసుకుంటుంటే.. వీకెండ్స్‌లో మాత్రం ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వడానికి కాంపాక్ట్ బార్ కౌంటర్లు, కాఫీ టేబుల్స్ సెట్ చేయడం ఒక లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది.
అయితే ప్లేస్ తక్కువగా ఉండే ఇరుకైన బాల్కనీలను కూడా తెలివిగా డిజైన్ చేస్తున్నారు. గోడలకు అమర్చే వాల్-మౌంటెడ్ టేబుల్స్, అవసరం లేనప్పుడు మడతపెట్టేసే ఫోల్డింగ్ కుర్చీలు, లైట్ కలర్స్ వాడటం ద్వారా తక్కువ స్పేస్ ఉన్నా కూడా స్పేసియస్‌గా కనిపిస్తోంది.
