Donald Trump
అమెరికా పొలిటికల్ స్క్రీన్‌పై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్.. గ్లోబల్ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2020 యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఓటింగ్ డేటాలో అక్రమాలు జరిగాయన్న ట్రంప్.. నాన్-సిటిజన్స్ అక్రమంగా ఓటు వేశారని అనడం అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
దీంతో అమెరికాలో ఓటింగ్ వ్యవస్థను సమూలంగా మార్చడానికి ప్రవేశపెట్టిన సేవ్ అమెరికా యాక్ట్ (SAVE Act)కు సపోర్ట్ కూడగడుతూ, ఇండియాలో అనుసరిస్తున్న ఫోటో ఐడెంటిటీ కార్డు నిబంధనలను, భారత ఎన్నికల మోడల్‌ను ఉదాహరణగా చూపిస్తూ కొత్త చర్చకు తెరలేపారు.
యుఎస్ సెన్సస్ బ్యూరో నిర్వహిస్తున్న విశ్లేషణను ప్రస్తావించిన ట్రంప్.. తన ట్రూత్ సోషల్ (Truth Social) అకౌంట్‌లో కొన్ని గణాంకాలను షేర్ చేశారు. సెన్సస్ బ్యూరో 2020 నాటి ఓటర్ రికార్డులను పౌరసత్వ వివరాలతో క్రాస్ చెక్ చేస్తోందని, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా పరిశీలించిన 12.8 కోట్ల ఓటర్లలో..సుమారు 24,000 మందికి పైగా పౌరసత్వం లేనివారు ఓటు వేసినట్లు తేలిందని అన్నారు.
ఇంకా 3.2 కోట్ల ఓటర్ల డేటాను పరిశీలించాల్సి ఉందని చెప్పిన ట్రంప్.. అది పూర్తయితే ఈ అక్రమ ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే అమెరికాలో ఓటరు గుర్తింపు కార్డును తప్పనిసరి చేసే సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ (SAVE) చట్టాన్ని వెంటనే ఆమోదించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
ఒకవేళ ట్రంప్ కోరినట్లే ఆ చట్టాన్ని ఆమోదిస్తే అమెరికాలోని అన్ని రాష్ట్రాలు కూడా ఫెడరల్ డేటాబేస్‌లను ఉపయోగించి ఓటర్ లిస్ట్ నుంచి పౌరులు కాని వారి పేర్లను తొలగించాలి. అంతేకాకుండా మెయిల్ ఇన్ ఓటింగ్‌ను తీవ్ర అనారోగ్యం, శారీరక వైకల్యం, మిలిటరీ సర్వీస్, ప్రయాణాల్లో ఉన్నవారికి మాత్రమే వర్తింపచేయాలని ఈ బిల్లు సూచిస్తోంది.
అయితే ఈ బిల్లు ఆమోదం పొందడం అంత ఈజీ ఏమీ కాదు. అమెరికా కాంగ్రెస్‌లోని డెమోక్రాట్లు , రిపబ్లికన్ల మధ్య ట్రంప్ ప్రతిపాదనపై తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సెనేట్ కూడా ఈ నెల ప్రారంభంలో ఎలాంటి ముందడుగు పడకుండానే ఐదు వారాల పాటు వాయిదా పడింది.
తన వాదనకు మరింత బలం చేకూర్చడానికే ఇప్పుడు ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నా కూడా..పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఒక శాతం కంటే తక్కువగా ఉన్నారని .. ప్రతి ఒక్కరూ కచ్చితమైన ఫోటో గుర్తింపు కార్డును ఉపయోగించారని ట్రంప్ హైలైట్ చేసి చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అధ్యక్షురాలు టోమోకో అకానెతో పాటు సీనియర్ ట్రయల్ లాయర్ అబూదౌలాయే సేయె అలాగే మరో ఇద్దరు అధికారులపై డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఐసీసీ తమ పరిధిని దాటి ప్రవర్తిస్తోందని అలాగే అమెరికా జాతీయ సార్వభౌమాధికారానికి కూడా భంగం కలిగిస్తోందని విదేశాంగ మంత్రి మార్కో రూబియో ద్వారా ప్రకటన రిలీజ్ చేశారు. అంతర్జాతీయ కోర్టు ఒక అవినీతిమయమైన, రాజకీయ ప్రేరేపిత సంస్థగా మారిందని, దేశ సార్వభౌమాధికారంపై దాడిని ఏమాత్రం సహించబోమని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తేల్చి చెప్పింది.
USA President Donald J Trump posts, "The Census Bureau has begun checking the Voter Records from 2020 against their Citizenship Records. On the first 128,000,000 Voters, the Census Bureau proves that over 24,000 Noncitizens voted illegally! The Census Bureau is going to analyse… pic.twitter.com/r1PulZDG63
— ANI (@ANI) August 19, 2026
