Just NationalJust PoliticalLatest News

Population : ఒక్కరు ముద్దు ట్రెండ్‌కు ఎండ్ కార్డ్..ఏపీ, తెలంగాణ, తమిళనాడులో రివర్స్ అవుతున్న జనాభా గేమ్..

Population : విజయ్ సర్కార్ మూడో బిడ్డకు కూడా 365 రోజుల మెటర్నిటీ లీవు మంజూరు చేస్తూ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన జీవో కూడా త్వరలోనే వెలువడబోతోంది.

Population

ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు అంటూ దశాబ్దాల పాటు ప్రచారం చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు రూట్ పూర్తిగా మార్చేశాయి. ఎక్కువ మంది పిల్లలను కనండి, మిగిలిన బాధ్యతలను, ప్రోత్సాహకాలను మేం చూసుకుంటామని ఓపెన్‌గా పిలుపునిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో తమిళనాడులో తమిళ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జోసెఫ్ విజయ్ సారథ్యంలో ఊహించని సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

మూడోసారి తల్లయ్యే మహిళా గవర్నమెంట్ ఉద్యోగులకు ఇప్పటివరకు ఇస్తున్న 12 వారాల మెటర్నీటీ లీవ్స్‌ (Maternity Leaves)ను ఏకంగా ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక.. చాలా పెద్ద పొలిటికల్ అండ్ సోషల్ చేంజ్ ఉంది. తమిళనాడులో 2011లో మెటర్నీటీ లీవ్స్‌ను 90 రోజుల నుంచి 6 నెలలకు పెంచగా, 2016లో 9 నెలలకు, జులై 2021లో ఏడాదికి పెంచారు. కాకపోతే ఇద్దరు లేదా అంతకంటే తక్కువ మంది ఉన్నవారికి మాత్రమే సంవత్సరం పాటు పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేవారు.

తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నవారికి 12 వారాల మెటర్నీటీ లీవ్స్‌ను వర్తింపజేసేవారు. కానీ ఇప్పుడు విజయ్ సర్కార్ మూడో బిడ్డకు కూడా 365 రోజుల మెటర్నిటీ లీవు మంజూరు చేస్తూ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన జీవో కూడా త్వరలోనే వెలువడబోతోంది.

ఈ నిర్ణయం వెనుక అసెంబ్లీ సమావేశాలలో జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణంగా తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్. పల్లవి తన చంటిపాపను చేతుల్లో ఎత్తుకుని అసెంబ్లీ సమావేశాలకు రావడం, ఆ తర్వాత తన అసిస్టెంట్‌కు బిడ్డను ఇచ్చి విధుల్లో పాల్గొనడం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే లేపింది.

అయితే కేవలం తమిళనాడు మాత్రమే కాదు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పిల్లలను కనడంపై ప్రోత్సహిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాబోయే జనాభా సంక్షోభం (Demographic Crisis) గురించి హెచ్చరిస్తూ ..ఏపీలో సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate) ప్రమాదకరంగా 1.5 కి పడిపోయిందని, ఇది జనాభా స్థిరత్వానికి కావాల్సిన 2.1 కంటే చాలా తక్కువ అని చెప్పారు.

అందుకే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు,ఇన్సెంటివ్‌లు అందిస్తామని అన్నారు. అంతేకాదు రాజకీయాలలో గతంలో ఉన్న ఆంక్షలను తొలగిస్తూ ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు కూడా సర్పంచ్, మున్సిపాలిటీ వంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టసవరణ చేయడానికి అడుగులు వేస్తున్నారు.

ఇక తెలంగాణలోనూ సంతానోత్పత్తి రేటు 1.7 కంటే తక్కువకు పడిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్క్‌ఫోర్స్ తగ్గకుండా ఉండేలా దంపతులకు అవగాహన పెంచడం, సంక్షేమ పథకాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఫోకస్ పెడుతున్నారు.

సౌత్‌లోని సీఎంలందరూ ఒక్కసారిగా ఇలా రివర్స్ అవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది.. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) భయం. జనాభా ప్రాతిపదికన కనుక ఎంపీ సీట్లను కేటాయిస్తే, కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటించిన మన దక్షిణాది రాష్ట్రాలు మాత్రం లోక్‌సభలో తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో జనాభా విపరీతంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరిగిపోతే కేంద్రంలో దక్షిణాది రాజకీయ ఆధిపత్యం దెబ్బతింటుంది.

Population
Population

ఇక రెండోది.. జపాన్, యూరప్ దేశాల లాగా మన దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో యువత శాతం తగ్గిపోయి, వయోధికుల సంఖ్య పెరిగితే భవిష్యత్తులో కంపెనీలకు వర్క్‌ఫోర్స్ దొరకక ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉంటుంది.

ఒకవైపు ప్రోత్సాహకాలు ఇస్తూ శ్రామిక శక్తిని కాపాడుకోవడం, పార్లమెంట్‌లో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సేఫ్‌గా ఉంచుకోవడం ప్లస్ పాయింట్. అయితే నాణేనికి రెండో వైపు చూస్తే..పిల్లలను కనమనడం కాదు పెరిగే జనాభాకు(Population) తగ్గట్లుగా ఉద్యోగావకాశాలు కల్పించడం, మౌలిక వసతులు, పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాలకు తలకు మించిన భారమే అవుతుంది .

Varalakshmi Vratam : వరలక్ష్మి దేవి కృపను పొందడం ఎలా? వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి?

Related Articles

Back to top button