Ebola Virus :ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. ఎబోలా వైరస్‌కు టీకా వచ్చేసింది..

Ebola Virus : ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఎబోలా కొత్త రూపాలపై పోరాడేందుకు సరికొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు రష్యా శాస్త్రవేత్తలు తెలిపారు.

Ebola Virus

కరోనా మహమ్మారి తర్వాత ఆ స్థాయిలో ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఎబోలా.. ప్రస్తుతం ఆఫ్రికా ఖండాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ (Ebola Virus) ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. దీనిని నియంత్రించడానికి డబ్ల్యూహెచ్ వో తమ చర్యలను ముమ్మరం చేసింది. ఇదే క్రమంలో హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది.

ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ కూడా లేదు. అయితే తాజాగా రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. ఎబోలావైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఎబోలా కొత్త రూపాలపై పోరాడేందుకు  సరికొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు రష్యా శాస్త్రవేత్తలు తెలిపారు. బుండిబుగ్యో ఎబోలా వైరస్ రకాన్ని అదుపు చేసేందుకు టీకాను తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో వెల్లడించారు.

రష్యా ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చే వార్తగా భావిస్తున్నా వ్యాక్సిన్ ప్రభావం ఏ స్థాయి వరకూ ఉంటుందనేది తెలియాల్సి ఉంది. దీని కోసం క్లినికల్ ట్రయల్స్ నుంచి డేటా, పీర్ రివ్యూడ్, నియంత్రణ సమీక్ష వంటివి చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ (Ebola Virus) అత్యంత ప్రమాదకరమైందిగా మారింది. డబ్ల్యూహెచ్ వో అంచనా ప్రకారం వైరస్  సోకిన వారిలో సగం మంది చనిపోతున్నారు. కొత్త కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కాంగో, ఉగాండాలో దాదాపు వెయ్యి కేసులు నమోదు కాగా అందులో 50 శాతం మరణాలున్నాయి. వందలాది అనుమానిత కేసులు కూడా ఉన్నాయి.

అయితే ఆఫ్రికా దేశాల్లో స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా కేసుల తీవ్రత పెరుగుతోంది. ప్రజలను సరైన రీతిలో అప్రమత్తం చేయలేకపోవడం, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించకపోవడం ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. మరోవైపు రష్యా మాత్రమే కాదు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్నారు.

Ebola Virus

ఉగాండా, దక్షిణ సూడాన్‌లో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా రకానికి వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే జంతువులపై టెస్టులు జరుగుతున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది. సింగిల్ డోస్ ఎబోలా వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నట్లు వెల్లడించింది.

కాగా కరోనా తరహాలోనే ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలుస్తోంది. దీంతో బయటిదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు, స్థానికులకు ఎయిర్ పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే నగరంలో అడుగుపెట్టడానికి అనుమతినిస్తున్నారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version