Flights : ఆకాశంలో ఫ్లైట్స్ క్రాష్ అవ్వవా? విమానాలు ఢీకొట్టకుండా పైలట్లు వాడే ఫార్ములా ఏంటి?

Flights : గాలిలో ఎదురెదురుగా వచ్చే విమానాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోకుండా ఎలాంటి సిస్టమ్ పని చేస్తుంది? ఆకాశంలో ఎయిరోప్లేన్స్ ట్రాఫిక్ వెనుక ఉన్న అసలైన టెక్ మిస్టరీ ఏంటనే క్యూరియాసిటీ చాలామందికి కలుగుతుంది.

Flights

నేల మీద వెళ్లే కార్లు, బైకులు, బస్‌లకు కంటికి కనిపించే రోడ్లు, డివైడర్లు, వైట్ లైన్లు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. మరి ఎలాంటి రోడ్లు లేని ఆకాశంలో .. వేల కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లే విమానాలు ఒకసారి కూడా దారి తప్పకుండా అంత పర్ఫెక్ట్‌గా ఎలా వెళ్తాయనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. ఎదురెదురుగా వచ్చే విమానాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోకుండా ఎలాంటి సిస్టమ్ పని చేస్తుంది? ఆకాశంలో ఎయిరోప్లేన్స్ ట్రాఫిక్ వెనుక ఉన్న అసలైన టెక్ మిస్టరీ ఏంటనే క్యూరియాసిటీ చాలామందికి కలుగుతుంది.

నిజానికి ఒకే రోడ్డుపై వేర్వేరు సర్వీస్ నెంబర్లతో తిరిగినట్లే, ఫ్లైట్స్‌కు కూడా స్పెషల్ సర్వీస్ నెంబర్లు ఉంటాయి. అయితే ఎయిర్‌పోర్టుల్లో ప్రతి 3 నిమిషాలకు ఒక విమానం అయినా సరే టేకాఫ్ అవడం కానీ ల్యాండింగ్ అవడం కానీ జరుగుతుంటాయి. అయితే ఇవన్నీ క్రాష్ అవ్వకుండా ఉండటం వెనుక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) మైండ్ గేమ్ ఉంటుంది.

ఫ్లైట్ ఎంత ఎత్తులో ఎగరాలో, ఎన్ని డిగ్రీల యాంగిల్‌లో వెళ్లాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిసైడ్ చేస్తుంది. పైలట్ స్క్రీన్ పైన, అలాగే ఏటీసీ కంప్యూటర్లలో 360 డిగ్రీల డిజిటల్ రూట్ మ్యాప్ రన్ అవుతూ ఉంటుంది. తూర్పు వైపు వెళ్లే ఫ్లైట్స్ 0 నుంచి 179 డిగ్రీల కోణంలో ప్రయాణిస్తే, పడమర వైపు వెళ్లే ఫ్లైట్స్ 180 నుంచి 359 డిగ్రీల కోణంలో ప్రయాణిస్తాయి.

విమానాలు ఎగిరే ఎత్తు (Altitude) విషయంలో ఉండే పక్కా రూల్ అన్నదే ఇక్కడ అసలైన లెక్క. ఈస్ట్ సైడ్ వెళ్లే విమానాలు 31వేలు, 33వేలు, 35వేల అడుగుల బేసి సంఖ్యల (Odd numbers) ఎత్తులో ఎగురుతాయి. అదే పడమర వైపు వెళ్లేవి మాత్రం 32వేలు, 34వేలు, 36వేల అడుగుల సరి సంఖ్యల (Even numbers) హైయిట్‌లో ప్రయాణిస్తాయి. దీనివల్ల పొరపాటున ఒకే రూట్‌లో ఎదురెదురుగా వచ్చినా కూడా ఫ్లైట్స్ మధ్య నిలువుగా కనీసం వెయ్యి అడుగుల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఢీకొనే అవకాశం
ఉండదు.

ఇక అడ్డంగా (Horizontal) చూస్తే ఎప్పుడూ కూడా రెండు ఫ్లైట్స్ మధ్య కనీసం 3 నుంచి 5 మైళ్ల డిస్టెన్స్ ఉండేలా ఏటీసీ మానిటర్ చేస్తుంది. జీపీఎస్, రేడియో వేవ్స్ హెల్ప్‌తో గాల్లో కనిపించే డిజిటల్ లైన్స్ ఆధారంగా విమానం టేకాఫ్ అయ్యాక పైలట్లు ఆటో పైలట్ మోడ్ ఆన్ చేస్తారు. అది రాడార్‌ను ఫాలో అవుతూ స్మూత్‌గా తీసుకెళ్తుంది.

అయితే తాజాగా అమెరికా ఎయిర్ లైన్స్‌లో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిన ఘటన గురించి ఒకసారి చెప్పుకోవాలి. షికాగో నుంచి ఫీనిక్స్ వెళ్లాల్సిన అమెరికన్ 2482 అనే సర్వీస్ ఫ్లైట్ చాలా డిలే అయింది. దీంతో ఫీనిక్స్ ప్యాసింజర్స్ కోసం కంపెనీ సేమ్ సర్వీస్ నెంబర్‌తో ఇంకో ఫ్లైట్ పంపింది.

Flights

ఫీనిక్స్ నుంచి ఆ కొత్త ఫ్లైట్(Flights) టేకాఫ్ అవుతున్న సమయంలోనే, షికాగో నుంచి లేట్‌గా వచ్చిన ఫ్లైట్ ల్యాండింగ్ కోసం సరిగ్గా అదే రూట్‌లోకి అనుకోకుండా వచ్చేసింది. 2 ఫ్లైట్స్‌కు ఒకే సర్వీస్ నెంబర్ ఉండటంతో ఏటీసీ ఇన్‌స్ట్రక్షన్స్ తమకే అనుకుని రెండూ ఒకే ఎత్తులోకి వచ్చి ఢీకొట్టే పరిస్థితి వచ్చింది.

కానీ ATC కంట్రోలర్ స్పాట్‌లో అలర్ట్ అయి, సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. టేకాఫ్ అవుతున్న ఫ్లైట్(Flights) తక్కువ ఎత్తులో, ల్యాండ్ అవుతున్న విమానం ఎక్కువ ఎత్తులో రావాలని టేకాఫ్, ల్యాండింగ్ అనే పదాలు యాడ్ చేసి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ఘోర ప్రమాదం తప్పింది.

Speaking Without Thinking : ఆలోచించకుండా మాట్లాడే అలవాటు ఉందా? జాగ్రత్త ..నోరు కంట్రోల్ లేకపోతే రిలేషన్స్ కొట్టుకుపోతాయ్..

Exit mobile version