Gold and Silver Lovers
పసిడి, వెండి కొనాలనుకునే వారికి ఈరోజు బిగ్ రిలీఫ్ లభించింది. శుక్రవారం పెరిగిన పసిడి ధరకు(Gold and Silver Lovers) శనివారం ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు, ముఖ్యంగా అమెరికా , ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి.
రెండు దేశాల మధ్య సుమారు అరవై రోజుల పాటు కాల్పుల విరమణ ఉండేలా, అలాగే కీలకమైన సముద్ర మార్గాలను తెరిచేలా ఒక టెంపరరీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైన్ చేయాల్సి ఉంది.
ఈ సానుకూల వార్తల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదొడుకులు మొదలై.. భారతదేశంలో కూడా బంగారం ధరలు(Gold and Silver Lovers0 భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఉదయం మార్కెట్ ప్రారంభంలో నమోదయ్యే ఈ రేట్లు రోజులో మారుతుంటాయి. వచ్చే వారంలో కూడా వీటిల్లో మరికొన్ని మార్పులుండే అవకాశముందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలను గమనిస్తే.. పది గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర నిన్నటి కంటే దాదాపు 600 రూపాయల వరకు తగ్గి రూ. 1 లక్ష 57వేల 40 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే సామాన్యులు ఎక్కువగా కొనే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 550 రూపాయల మేర పతనమై, ప్రస్తుతం రూ. 1 లక్ష 43 వేల 950 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో కూడా ఇవే రేట్లు నడుస్తుండగా, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1 లక్ష 57 వేల 190 , ఇరవై రెండు క్యారెట్ల రేటు రూ. 1 లక్ష 44 వేల 100 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, కోల్‌కతా, చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర 1 లక్ష 59 వేల 600 రూపాయల వద్దకు చేరగా, ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూ. 1 లక్ష 46 వేల 300 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు పసిడి ధరలను పరిశీలిస్తే, శనివారం ఉదయం మార్కెట్ లెక్కల ప్రకారం సిల్వర్ రేట్లలో పెద్దగా మార్పు ఏమీ లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. మన హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం , చెన్నై నగరాలలో ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రెండు లక్షల తొంభై వేల వంద రూపాయల వద్ద స్థిరంగా ఉంది.
అదే సమయంలో ఢిల్లీ, ముంబై , బెంగళూరు లాంటి ఇతర మెయిన్ సిటీలలో కిలో వెండి రేటు 2 లక్షల 80 రూపాయల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ ప్రభావం , అమెరికా ఫెడ్ బ్యాంక్ నుంచి వస్తున్న సంకేతాల వల్ల రాబోయే రోజుల్లో ఈ సిల్వర్, గోల్డ్ ధరలలో మరిన్ని భారీ మార్పులు చూసే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
