Honey Trap : పాక్ హనీ ట్రాప్‌లో జోషితా పాల్, అన్వి మెహతా ఎవరు? 18 మందికి సీఐ సెల్ షాక్..

Honey Trap : సాయి వరప్రసాద్‌ను విశాఖలో, ప్రదీప్ ముఖర్జీని కోయంబత్తూరులో అరెస్ట్ చేసి.. విజయవాడ కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి అక్టోబర్ 14 వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Honey Trap

ఫేస్ కూడా చూడకుండా సోషల్ మీడియాలో క్యూట్ ప్రొఫైల్ పిక్స్ చూసి మురిసిపోతే ఎలాంటి ముప్పు ఫేస్ చేయాల్సి వస్తుందో తెలిసినా అదే తప్పు చేస్తున్న ఘటనలు భారత్‌లో ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇలాగే పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ విసిరిన క్యూటీ వలపు వలలో చిక్కుకుని, మన దేశానికి చెందిన అత్యంత సెన్సిటివ్ అయిన డిఫెన్స్ సీక్రెట్స్‌ను బోర్డర్స్ దాటించేస్తున్న ఒక అంతర్రాష్ట్ర గూఢచర్య ముఠా గుట్టును ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్(సీఐ సెల్) అత్యంత చాకచక్యంగా ఛేదించింది.

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ(Honey Trap) స్పై నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో సహా పెకలించడానికి ఆపరేషన్ ఫైర్‌వాల్-2026 పేరుతో సీఐ సెల్ అధికారులు ఏపీ ,తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఛత్తీస్‌గఢ్, బీహార్ వంటి 10 మెయిన్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ(Honey Trap) మెగా ఆపరేషన్‌లో డిఫెన్స్ రంగానికి చెందిన 13 మంది నేవీ సిబ్బందితో పాటు మొత్తం 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ఎంక్వయిరీ చేయడమే కాకుండా, వారి వద్ద నుంచి కీలక ఎలక్ట్రానిక్ ప్రూఫ్స్, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఎంక్వయిరీలో వైజాగ్ నేవల్ బేస్‌లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా వర్క్ చేస్తున్న అన్నం సాయి వరప్రసాద్‌తో పాటు నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీ రోల్‌పై పక్కా ప్రూఫ్స్ లభించడంతో అధికారులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. సాయి వరప్రసాద్‌ను విశాఖలో, ప్రదీప్ ముఖర్జీని కోయంబత్తూరులో అరెస్ట్ చేసి.. విజయవాడ కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి అక్టోబర్ 14 వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

దర్యాప్తులో తేలిన నిజాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. సాయి వరప్రసాద్ విశాఖ నావల్ బేస్‌ నుంచి సీక్రెట్ ఇన్ఫర్మేషన్‌ను పాక్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ దండిగా డబ్బులు వెనకేసుకోగా, ప్రదీప్ ముఖర్జీ పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అవసరమైన భారతీయ నెంబర్ల ఓటీపీలను సమకూరుస్తూ, రెగ్యులర్‌గా నేవీ సీక్రెట్స్‌ను దాటవేసేవాడు. దీని కోసం వీరిద్దరికీ పాక్ ఐఎస్‌ఐ హవాలా మార్గాల ద్వారా, క్రిప్టో కరెన్సీ రూపంలోనూ భారీగా ఫండ్స్ పంపినట్లు ఆధారాలు లభించాయి.

పాకిస్తాన్ ఏజెంట్లు నడిపిన ఈ(Honey Trap) గూఢచర్య రాకెట్‌లో ..జోషితా పాల్, అన్వి మెహతా అనే ఇద్దరు ఫేక్ మహిళా ప్రొఫైల్స్ ప్రధాన పాత్ర పోషించాయి. ముంబై నౌకా నిర్మాణ సంస్థలో పని చేస్తున్నానని నమ్మించిన జోషితా పాల్, ఫేస్‌బుక్ ద్వారా నేవీ ఆఫీసర్స్‌కు అందమైన వల వేసి వాట్సాప్ వీడియో కాల్స్, కవ్వించే మాటలతో బురిడీ కొట్టించేది. తర్వాత మెల్లగా యుద్ధనౌకలు, సబ్‌మెరీన్‌ల కదలికలు, కమాండింగ్ అధికారుల వివరాలిస్తే పెద్ద మొత్తంలో డబ్బులిస్తామని ఆశ చూపేంచేది.

Honey Trap

ఇక అన్వి మెహతా అనే మరో ప్రొఫైల్.. ఢిల్లీలో తాను సైకాలజిస్ట్‌నని పరిచయం చేసుకుని వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్‌లో మాట్లాడేది. నౌకాదళ స్థావరాలు, సబ్‌మెరీన్‌ల సీక్రెట్ ఏరియాలను కెమెరాలో చూపించాలని వారిపై బాగా ఒత్తిడి తెచ్చేది.

మొత్తంగా అందం, డబ్బు ఆశ చూపించి భారత దేశ భద్రతకు ఎసరు పెట్టాలని చూసిన దాయాది దేశం పాకిస్తాన్ కుట్రను.. ఏపీ సీఐ సెల్ సమర్థవంతంగా తిప్పికొట్టి, శత్రు దేశానికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

Honey Trap : బోర్డర్ దాటుతున్న డిఫెన్స్ సీక్రెట్స్..రక్షణ దళాలు కూడా హనీట్రాప్ మాయలో ఎందుకు పడతాయి?
↑
Exit mobile version