Putin Victory : రష్యా ఎలక్షన్లలో పుతిన్ సునామీ..చివరి నిమిషంలో డ్రోన్ల వర్షం..

Putin Victory : యుద్ధం జరుగుతున్నసమయంలో ప్రజలంతా తమకే సపోర్ట్‌గా ఉన్నారని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెబుతూ పుతిన్ వర్గం మాస్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది.

Putin Victory

ఓ వైపు ఐదేళ్లుగా ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధం.. మరోవైపు ప్రపంచ దేశాల ఆంక్షలతో అంతర్జాతీయంగా విపరీతమైన ఒత్తిడి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ప్రజలు పుతిన్ వైపు నిలబడ్డారా లేక ఈ వార్ వద్దని తిరగబడుతున్నారా? అంటూ యావత్ ప్రపంచం రష్యా వైపు చూస్తుండగానే బిగ్ ఎలక్షన్ డ్రామా ముగిసింది.

క్రెమ్లిన్ బాస్ వ్లాదిమిర్ పుతిన్ చెబుతున్నట్లుగానే.. పాశ్చాత్య దేశాల అంచనాలను తలకిందులు చేస్తూ రష్యా ఎలక్షన్స్‌లో ఆయన మద్దతు ఉన్న యునైటెడ్ రష్యా పార్టీ ఒక పెద్ద సునామీనే క్రియేట్ చేస్తుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రజలంతా తమకే సపోర్ట్‌గా ఉన్నారని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెబుతూ పుతిన్ వర్గం మాస్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది.

రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ లెక్కల ప్రకారం.. సుమారు 95 శాతానికి పైగా ఓట్లు లెక్కించే సమయానికి అఫీషియల్ యునైటెడ్ రష్యా పార్టీ ఏకంగా 57.83 శాతం ఓట్లను తన అకౌంట్లో వేసుకుంది. 2021లో జరిగిన ఎన్నికలలో 49.8 శాతం ఓట్లు.. ఈసారి యుద్ధం నడుస్తున్నా సరే తమ ఓటు బ్యాంకును భారీగా పెంచుకుంది.

రష్యా దిగువ సభ అయిన స్టేట్ డ్యూమాలో మొత్తం 450 సీట్లు ఉండగా.. దీనిలో సగం అంటే 225 సీట్లకు డైరెక్టుగా ఎన్నికలు జరిగాయి. కాగా 225 సింగిల్ మెంబర్ స్థానాల్లో ఏకంగా 208 చోట్ల పుతిన్ పార్టీయే దూసుకుపోయింది(Putin Victory). ఓవరాల్‌గా చూస్తే 450 సీట్లకు గానూ యునైటెడ్ రష్యా పార్టీ 355 సీట్లు సాధించి మూడింట రెండొంతుల కంటే ఎక్కువ డామినేషన్ సాధించింది. నిజానికి రష్యాలో మ్యాజిక్ ఫిగర్ మెజార్టీకి 301 సీట్లు వస్తే చాలు, కానీ 2003 నుంచి హవా నడిపిస్తున్న పుతిన్ వర్గం ఇప్పుడు ఏకంగా 355 సీట్లతో డ్యూమాపై తమదే అసలైన పవర్ అని ప్రూవ్ చేసింది.

ఈ ఎన్నికల్లో సుమారు 57 శాతం మంది రష్యన్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మిగతా ప్రతిపక్ష పార్టీల గ్రాఫ్ చూస్తే.. కమ్యూనిస్ట్ పార్టీ (CRPF) 13.8 శాతంతో సెకండ్ ప్లేస్‌లో నిలవగా, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDPR) 8.99 పర్సంటేజ్‌, న్యూ పీపుల్ పార్టీ 7.96 పర్సంటేజ్ ఓట్లు సాధించాయి. ఇక ఏ జస్ట్ రష్యా పార్టీ కేవలం 4.96 శాతం ఓట్లకే పరిమితమై, పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడానికి కావాల్సిన కనీస 5 శాతం కండీషన్‌ను కూడా దాటలేక దారుణంగా ఫెయిలయింది.

అయితే ఈ విక్టరీపై అమెరికా, పశ్చిమ దేశాలు .. ఇదసలు ఎన్నికలే కావు ఒక ఫేక్ డ్రామా అని మండిపడుతున్నాయి. పుతిన్‌కు వ్యతిరేకంగా.. శాంతి, స్వేచ్ఛ నినాదంతో ముందుకు వచ్చిన లిబరల్ పార్టీ యూబ్లోకోను తొక్కిపడేశారని, నిబంధనలు ఉల్లంఘించారనే వంకతో రష్యా సుప్రీం కోర్టు ద్వారా ఆ పార్టీపై నిషేధాన్ని విధించి పోటీలోనే లేకుండా చేశారని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ఇక లోకల్ స్థాయిలో చూస్తే, చెచెన్ లీడర్, పుతిన్ మిత్రుడు రమ్జాన్ కదిరోవ్ ఏకంగా 99.85 శాతం ఓట్లతో గెలిచి సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశాడు.

Putin Victory

అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ ముగిసే సమయానికి రష్యాకు.. ఉక్రెయిన్ ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. పుతిన్ వర్గీయులు సంబరాల్లో మునిగిపోయే లోపే సరిహద్దులోని ఏకంగా 19 ప్రాంతాలతో పాటు క్రిమియాపై ఒకేసారి ఎవరూ ఊహించని విధంగా 1110 రాకాసి డ్రోన్లతో పంజా విసిరింది. ఈ సంవత్సరంలోనే ఒకే రోజున జరిగిన అత్యంత భారీ డ్రోన్ దాడిగా ఇది నిలిచింది.

దీంతో అలర్ట్ అయిన రష్యా ఎయిర్ ఫోర్స్ తాము ఆ డ్రోన్ల్ అన్నింటినీ గాల్లోనే కూల్చేశామని ప్రకటించింది. ఏది ఏమైనా, ఉక్రెయిన్ డ్రోన్ల వార్ ఒకవైపు, వెస్ట్రన్ కంట్రీస్ వ్యతిరేకత మరోవైపు ఉన్నా కూడా, ఎన్నికల ఫలితాలతో పుతిన్(Putin Victory) మాత్రం రష్యాపై తనకున్న తిరుగులేని కంట్రోల్‌ను మరోసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రదర్శించారు.

NOT Admitting WrongDoing : మీది తప్పు అని చెప్పగానే హర్ట్ అవుతున్నారా?..విమర్శను దాడిగా ఎందుకు ఫీలవుతున్నారు?

Exit mobile version