Trump On Iran Strike
ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లూ ఇప్పుడు మళ్లీ మిడిల్ ఈస్ట్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే మరో భారీ వినాశకర వార్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు గ్లోబల్ వేదికలపై ప్రచారం పెరుగుతోంది. మరోసారి ఇరాన్‌పై మెరుపు సైనిక దాడులకు(Trump On Iran Strike) అమెరికా వేగంగా పావులు కదుపుతూ ఉండటం ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఆర్థిక, రాజకీయాధికార సమీకరణాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది.
ఈ అటాక్స్ పునరుద్ధరణ కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా తుది సంతకం చేయకపోయినా, వార్‌కు అవసరమైన యుద్ధ సన్నాహాలను మాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని పెంటగాన్‌తో పాటు యూఎస్ సెంట్రల్ కమాండ్‌ను ఇప్పటికే ఆదేశించారు. నవంబర్ 3న జరగబోతున్న అమెరికా మధ్యంతర ఎలక్షన్స్ కంటే ముందు కానీ లేదంటే దానికి కాస్త వారం రోజుల ముందు జరగబోయే ఇజ్రాయిల్ ఎన్నికల సమయంలోనే ఈ భారీ సైనిక చర్య ఉండే అవకాశముందని అమెరికా, ఇజ్రాయిల్ దౌత్య వర్గాలు క్లియర్‌గా సంకేతాలిస్తున్నాయి.
ఈసారి అటాక్స్ టార్గెట్ కేవలం సాధారణ సైనిక స్థావరాలు మాత్రమే కాదని, ఇరాన్‌కు(Trump On Iran Strike) వెన్నుముక వంటి న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్, కీలక ఇంధన వనరులు, మౌలిక సదుపాయాలే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా మిషన్‌లో అమెరికాతో పాటు ఇజ్రాయిల్ సైన్యం కూడా డైరెక్టుగా సంయుక్త దాడులు చేయడానికి రెడీ అవుతోందని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ పరిణామాలపై రెస్పాండ్ అయిన ట్రంప్.. ఇరాన్ సైన్యం(Trump On Iran Strike) ఇప్పుడు పూర్తిగా నాశనమైంది అని చెబుతూ.. వారి ఆర్థిక వ్యవస్థ అట్టడుగుకు పడిపోయిందని కామెంట్ చేశారు. ఇరాన్ చేతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రం దక్కకుండా చేయడమే తమ మెయిన్ టార్గెట్ అని ..అవసరమైతే ఈ పోరాటాన్ని చాలా స్పీడ్‌గా క్లోజ్ చేసేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అయితే ఈ యుద్ధం ముగిసిన వెంటనే గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన ధరలు దారుణంగా పడిపోతాయని ట్రంప్ విశ్లేషించడం హాట్ టాపిక్ అయింది. వరల్డ్ ఆయిల్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు మెయిన్ ఇంపార్టెంట్ అయిన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రస్తుతం పూర్తిగా అమెరికా నేవీ అదుపులోనే ఉందని ట్రంప్ తేల్చి చెప్పారు.
ఒకవేళ ఇప్పుడు అమెరికా చెబుతున్నట్లే ఈ విధ్వంసకర దాడులు కనుక జరిగితే, అది కేవలం ఆ 2,3 దేశాల మధ్య పోరుగానే మిగిలిపోదు. ఇరాన్ దీనికి గట్టిగా ప్రతిదాడికి దిగితే గల్ఫ్ ప్రాంతమంతా అగ్నిగుండంగా మారి గ్లోబల్ వైడ్‌గా సప్లై సిస్టమ్స్ దెబ్బతినే ప్రమాదముంది. ప్రారంభంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకి, ఆ తర్వాత ట్రంప్ చెబుతున్నట్లుగా మార్కెట్ కుప్పకూలినా ఆశ్చర్యపోనక్కర లేదు.
Emotional Dependency : మీ హ్యాపీనెస్‌కి కంట్రోలర్ వేరొకరా? సెల్ఫ్ లవ్ మోడ్‌లోకి మారాలనుకుంటున్నారా?
