Trump : దారుణంగా డౌన్ అయిన ట్రంప్ గ్రాఫ్.. సర్వేలో షాకింగ్ నిజాలు

Trump : కేవలం 31 శాతం మంది అమెరికన్లు మాత్రమే.. ఇరాన్‌పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను సమర్థిస్తున్నారు.

Trump

ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అస్సలు కలిసిరావడం లేనట్టే కనిపిస్తుంది. వైట్ హౌస్ తీసుకుంటున్న నిర్ణయాలపై అగ్రరాజ్యం ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

రోజురోజుకూ ముదురుతున్న ఇరాన్ యుద్ధం వల్ల తమ దేశానికి జరిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని భావిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తితో ట్రంప్ సర్కార్‌కు ఊహించని రీతిలో షాక్ ఇస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్రజాదరణ గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది.

రాయిటర్స్ ఇప్సోస్ లేటెస్ట్‌గా నిర్వహించిన సర్వే ఈ సంచలన నిజాలను పూసగుచ్చినట్లు బయటపెట్టింది. ఇరాన్‌తో ప్రస్తుతం అమెరికా జరుపుతున్న సైనిక పోరాటానికి మద్దతిచ్చే వారి సంఖ్య దారుణంగా పడిపోయిందని ఈ పోల్ వెల్లడించింది.

అమెరికా వ్యాప్తంగా 4 రోజుల పాటు సుమారు 1,215 మంది అడల్ట్స్ అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్టును రూపొందించారు. ఈ సర్వే ఫలితాల్లో ప్లస్ లేదా మైనస్ 3 శాతం వరకు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉండే చాన్స్ ఉందని రాయిటర్స్ ఇప్సోస్ టీమ్ స్పష్టం చేసింది.

రాయిటర్స్ తాజా పోల్ లెక్కల ప్రకారం కేవలం 31 శాతం మంది అమెరికన్లు మాత్రమే.. ఇరాన్‌పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను సమర్థిస్తున్నారు. అంటే ఏకంగా 69 శాతం మంది ఈ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నట్లు తేలింది.

Trump

గతంలో ఉన్న గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే కనుక ఈ ఏడాది మార్చి నెలలో నిర్వహించిన సర్వేలో.. 37 శాతం మంది ఇరాన్-యుఎస్ మిలిటరీ యాక్షన్‌కు ఓటేశారు. ఆ తర్వాత ఆగస్ట్ నెల ప్రారంభంలో అది 34 శాతానికి పడిపోయింది.

ఇప్పుడు ఏకంగా అది 31 శాతానికి దిగజారడం చూస్తుంటే, ట్రంప్ గ్రాఫ్ ఏ రేంజ్‌లో డౌన్ అవుతుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.దీంతో యుద్ధం పేరుతో సుదీర్ఘంగా సాగుతున్న ఈ ఘర్షణలు.. ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద గండంగా మారేలా కనిపిస్తున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Traffic Challans : ట్రాఫిక్ చలానా కట్టట్లేదా? డైరెక్ట్‌గా ఫాస్టాగ్ నుంచే కట్.. హైదరాబాద్‌ వాసులకు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్..

Exit mobile version