Traffic Challans : ట్రాఫిక్ చలానా కట్టట్లేదా? డైరెక్ట్‌గా ఫాస్టాగ్ నుంచే కట్.. హైదరాబాద్‌ వాసులకు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్..

Traffic Challans : ఫాస్టాగ్ అకౌంట్ల నుంచి డైరెక్టుగా ఫైన్ అమౌంట్ డిడక్ట్ చేసే క్రేజీ అండ్ మైండ్ బ్లాకింగ్ ప్రపోజల్‌ను.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా పరిశీలిస్తున్నారు.

Traffic Challans

హైదరాబాద్ రోడ్లపై బైక్ లేదా కార్ వేసుకుని వెళ్లేటప్పుడు హెల్మెట్ లేనపుడు, సిగ్నల్ జంప్ చేసినపుడు, ఓవర్‌స్పీడ్‌గా వెళ్లినపుడు పడిన ట్రాఫిక్ చలానాలను చాలామంది కేర్ చేయరు. పెండింగ్ చలానా చూసి తర్వాత చూద్దాంలే అంటూ లైట్ తీసుకుంటారు. కానీ ఇకపై అలాంటి సీన్ అస్సలు నడవదు. మీరు చేసే ఒక్క చిన్న ట్రాఫిక్ రూల్ వైలేషన్‌కు మీ వ్యాలెట్ లేదంటే ఫాస్టాగ్ అకౌంట్ క్షణాల్లో ఖాళీ అవబోతోంది. ఎందుకంటే ఫాస్టాగ్ అకౌంట్ల నుంచి డైరెక్టుగా ఫైన్ అమౌంట్ డిడక్ట్ చేసే క్రేజీ అండ్ మైండ్ బ్లాకింగ్ ప్రపోజల్‌ను.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా పరిశీలిస్తున్నారు.

కాగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ ఈ విషయం గురించి వెల్లడించారు. ఇటీవల జరిగిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) 20వ వార్షికోత్సవ ఈవెంట్‌లో ప్రజలు, భాగస్వామ్యం, టెక్నాలజీ ద్వారా సురక్షితమైన రోడ్డు నిర్మాణం అనే టాపిక్‌పై జరిగిన చర్చా వేదికలో ప్యానలిస్ట్‌గా పాల్గొన్న జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ ఐడియాను బయటపెట్టారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులతో కలిసి.. ఈ డిజిటల్ సిస్టమ్ అమలు గురించి ఆల్రెడీ ముచ్చటిస్తున్నామని, వారి నుంచి అధికారికంగా రెస్పాన్స్ రాగానే రంగంలోకి దిగుతామని చెప్పారు.

కేవలం పోలీసులు ఫైన్లు వేసి చలానాలు ఇంటికి పంపిస్తుంటే వాహనదారుల మైండ్‌సెట్‌లో ఎలాంటి చేంజ్ రావడం లేదని, జరిమానాలు ఎప్పటికప్పుడు వేగంగా కట్ అయితేనే డ్రైవింగ్ చేసేటప్పుడు బాధ్యతగా ఉంటారని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిప్రాయపడ్డారు. గడిచిన 20 ఏళ్లలో హైదరాబాద్ సిటీ గ్లోబల్ రేంజ్‌లో డెవలప్ అయిందని, దానికి తగ్గట్టే రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, ప్రాణాలు తీసే భయంకరమైన యాక్సిడెంట్లు కూడా దారుణంగా పెరిగిపోయాయని అన్నారు.

Traffic Challans

రోడ్డు సేఫ్టీ అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, వెహికల్స్ నడిపే ప్రతీ పౌరుడికి కూడా సమానమైన బాధ్యత ఉంటుందని సున్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను పర్మనెంట్‌గా తగ్గించాలంటే బెటర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, లాస్ట్-మైల్ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మల్టీ-లెవల్ పార్కింగ్ ఏరియాలను ప్లాన్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్లు, పోలీస్ వ్యవస్థ, టెక్ కంపెనీలతో పాటు సామాన్య ప్రజలు అందరూ చేతులు కలిపినప్పుడే రోడ్లపైన యాక్సిడెంట్లు లేని సేఫ్ జర్నీ సాధ్యమవుతుంది.

మరోవైపు ఈ న్యూస్ బయటకు రావడంతో ప్రజల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వ్యక్తమవుతోంది. కొంతమంది ఈ ఐడియాను స్వాగతిస్తుంటే, మరికొంతమంది మాత్రం రోడ్లమీద తప్పుడు కెమెరా రీడింగ్స్ వల్ల తమకు ప్రాబ్లెమ్స్ వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మరి ఈ ఫాస్టాగ్ ఫైన్ల కట్టింగ్ ప్రపోజల్‌కు హెచ్‌ఎండీఏ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో..ఒకవేళ ఇస్తే అమలు చేయడంలో ఎలాంటి సమస్యలు వస్తాయో చూడాల్సిందే.

Irumudi : బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ర్యాంపేజ్..4 రోజుల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టేసిన ఇరుముడి

Exit mobile version