Tariffs : వైట్‌హౌస్ వర్సెస్ 25 రాష్ట్రాలు.. అమెరికా కోర్టులో కొత్త లీగల్ వార్‌కు బ్రేకులు పడేనా

Tariffs : 1974 వాణిజ్య చట్టం సెక్షన్ 301 ప్రకారం ఏదైనా దేశంపై కొత్త టారిఫ్‌లు విధించాలంటే కనీసం ఏడాది కాలం సమగ్ర విచారణ జరపాలి.

Tariffs

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు..తీసుకుంటూనే ఉన్నారు. అమెరికా ఫస్ట్ విధానం అమలు చేయడానికి ప్రయత్నిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయి.

కొన్ని నిర్ణయాలపై అటు స్వదేశంలోనూ వ్యతిరేకత వచ్చింది. చాలా సందర్భాల్లో కోర్టులు కూడా మొట్టికాయలు వేసినా ట్రంప్ మాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. తాజాగా 60 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కొత్తగా విధించిన సుంకాల విషయంలో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా 25 రాష్ట్రాలు కోర్టుకెళ్లాయి.

కొత్త టారిఫ్‌(Tariffs)లపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని పేర్కొంటూ 25 రాష్ట్రాలు దావా వేసాయి. భారత్, యూరోపియన్ యూనియన్ సహా 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 10 నుంచి 12.5%  శాతం కొత్త సుంకాలను విధించింది. అయితే ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి బలవంతపు శ్రమను కారణంగా చూపిస్తూ కొత్త పన్నులు వేసారని రాష్ట్రాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి.

1974 వాణిజ్య చట్టం సెక్షన్ 301 ప్రకారం ఏదైనా దేశంపై కొత్త టారిఫ్‌లు విధించాలంటే కనీసం ఏడాది కాలం సమగ్ర విచారణ జరపాలి. కానీ 90 రోజుల్లోనే ఎటువంటి పూర్తిస్థాయి విచారణ జరపకుండా 60 దేశాలపై నివేదికను తీసుకొచ్చి సుంకాలు విధించారని కోర్టులో తెలిపాయి.

కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రోబ్ బొంటా ఆధ్వర్యంలో ఈ దావాను దాఖలు చేశారు. దీనిని అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ట్రంప్ తన అధికారంతో చట్టాలను ఉల్లంఘిస్తూ, అమెరికా ప్రజలపై నిత్యావసరాల భారాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నాయి. గతంలో కోర్టులు కూడా కొట్టివేసిన నిర్ణయాలను మరో రూపంలో తీసుకొస్తున్నారని తెలిపాయి.

Tariffs

మరోవైపు ట్రంప్ మాత్రం తన నిర్ణయాలను సమర్దించుకుంటున్నారు. విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గించాలని, స్వదేశీ ఉత్పత్తులను, తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు చెబుతున్నారు.

దీంతో 25 రాష్ట్రాలు వేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాష్ట్రాలకు అనుకూలంగా తీర్పు వస్తే ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టేనని భావిస్తున్నారు. ఇప్పటికే హెచ్ 1బీ వీసా , బర్త్ రైట్ సిటిజన్ షిప్ నిర్ణయాల్లోనూ ట్రంప్‌నకు కోర్టులు షాకిచ్చాయి.

Udhayanidhi Stalin : డబుల్ మీనింగ్ కామెంట్స్ రగడ..ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. సెక్షన్ల కింద కేసు బుక్

Exit mobile version