Trump
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు కొన్నిరోజులుగా చిన్న విరామం మాత్రమే వచ్చింది. చర్చలు ఫలించే పరిస్థితి లేకపోవడంతో మళ్లీ యుద్ధం మొదలవుతుందని ఇప్పటికే చాలా దేశాలు టెన్షన్ పడుతున్నాయి. వారి భయం నిజమయ్యేలా కనిపిస్తోంది. తాాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనే దీనికి కారణం.
మరోసారి యుద్ధం తప్పదని ట్రంప్(Trump) ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు సఫలం కాకపోతే యుద్ధం తిరిగి మొదలవ్వక తప్పదన్నారు. శాంతి కోసం తాము ప్రతిపాదించిన డీల్ ను అంగీకరించాలని ఇరాన్ కు అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, దీనికి ఇరాన్ సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించారు.
చర్చలు విఫలమవుతుండడానికి ఇరాన్ వైఖరే కారణమని ట్రంప్ మండిపడుతున్నారు. తాము యుద్ధాన్ని ముగించే ఉద్దేశంతోనే కాల్పుల విరమణ ప్రతిపాదన చేసామన్నారు. కానీ ఇరాన్ మాత్రం చర్చల సమయంలో మొండిగా వ్యవహరిస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఇలాగే మొండిపట్టు పడితే సీజ్ ఫైర్ కొనసాగించలేమని, మళ్లీ బాంబుల వర్షాన్ని ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రజలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
కాల్పుల విరమణ తమకు బాగా ఉపయోగపడిందనీ, తాము రెట్టింపు శక్తిని కూడగట్టుకున్నామంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ పోర్టులను దిగ్భంధం చేయడం అమెరికా సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. కేవలం కాల్పుల విరమణతో ఈ యుద్దం ఆగదని, సమగ్రమైన ఒప్పందంతోనే యుద్ధం ముగుస్తుందన్నారు.
ఇరాన్ కోసం మరోసారి తాము గొప్ప డీల్ తో రాబోతున్నట్టు చెప్పారు. ఇప్పుడు కూడా ఇరాన్ తన వైఖరి మార్చుకోకుంటే రాబోయే పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ యుద్ధం మొదలుకానుందని తేలిపోయింది. ఇప్పటికే హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు.
హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల విషయంలోనూ పలు ఆంక్షలు విధించింది. లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులతో తీవ్ర ఆగ్రహంతోనే ఉన్న ఇరాన్ మరోసారి హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తే చాలా దేశాల్లో చమురు సంక్షోభం తప్పదు. దీంతో అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లో అప్పుడే కలకలం మొదలైంది. ఇరాన్, అమెరికా ఎవరికి వారే ఇలా మొండి వైఖరితో యుద్ధాన్ని కొనసాగిస్తే చాలా దేశాలకు ఇంధన సంక్షోభం ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trump Tariffs ట్రంప్ పన్ను బాదుడుకు అమెరికా కోర్టు షాక్..భారత్‌కు రూ.1.12 లక్షల కోట్ల వరకూ రీఫండ్?
