Iran : ఇరాన్‌పై భీకర దాడులు..దద్దరిల్లిన పశ్చిమాసియా దేశాలు

Iran : రెండు దేశాల మధ్య గత నెలలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాడులు జరిగాయి.

Iran

ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసిపోయిందనీ, దాడులు చేస్తాం అంటూ ప్రకటించిన ట్రంప్ తగ్గేదే లేదంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే అమెరికా భీకర దాడులకు దిగింది.హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులను ప్రారంభించింది.

రెండు దేశాల మధ్య గత నెలలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. అమెరికా సెంట్‌కామ్ దళాలు ఇరాన్ లోని 80కి పైగా సైనిక లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. తీరప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి.ఓడరేవు కేంద్రాలైన సిరిక్, బందర్ అబ్బాస్, జాస్క్ వంటి దక్షిణ ప్రాంతాలలో క్షిపణులతో భీకర దాడులు జరిగాయి.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైన తర్వాత మొదటి సారిగా చాబహార్ పోర్టు ఐఆర్‌జీసీ స్థావరంపై అమెరికా ఫైటర్ జెట్‌లు బాంబుల వర్షం కురిపించాయి.అయితే అమెరికా దాడులకు ఇరాన్ కూడా దీటుగా బదులిచ్చింది.ఇరాన్ దళాలు కూడా పర్షియన్ గల్ఫ్, బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఎదురుదాడులు జరిపాయి.బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ వైమానిక దాడుల వల్ల కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది.

మరోవైపు ఇరాన్(Iran) సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్ మండిపడ్డారు.ఇరాన్(Iran) చేసే ప్రతి ఒక్క దాడికి తాము 20 రెట్లు తీవ్రంగా సమాధానం ఇస్తామని, అవసరమైతే ఇరాన్ విద్యుత్ గ్రిడ్‌లు , నీటి సరఫరా కేంద్రాలను కూడా టార్గెట్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Iran

అటు అమెరికా జరుపుతున్న దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను మరియు రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాలను ఉల్లంఘించడమేనని ఇరాన్ వాదిస్తోంది. వీటిని ప్రాంతీయ భద్రతకు పెనుముప్పుగా పేర్కొంటూ, తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రతీకార చర్యలు చేపడతామని హెచ్చరించింది.

అమెరికా దాడులకు తమ భూభాగాన్ని లేదా వాయుమార్గాన్ని ఉపయోగించుకునేలా అనుమతించే ఏ దేశమైనా తమకు వ్యూహాత్మక లక్ష్యంగా మారుతుందని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఈ క్రమంలోనే కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు జరిపామని తెలిపింది.

Karmic Relationship : కార్మిక్ రిలేషన్ షిప్ అంటే ఏంటో తెలుసా? మీది కూడా అలాంటి బంధమేనా?

Exit mobile version