US – Iran War
శాంతి చర్చలు.. యుద్ధం ముగిస్తాం… అంటూ కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ చెబుతున్న మాటలు అన్నీ మభ్యపెట్టేందుకేనని మరోసారి రుజువైంది. రెండు వైపులా ఎవ్వరూ తగ్గేదే లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంతో యుద్ధం మళ్ళీ మొదలైనట్టే కనిపిస్తోంది.
తాజాగా ఇరాన్ పై అమెరికా(US – Iran War) ప్రతీకార దాడులకు దిగింది. తమ అపాచీ హెలికాప్టర్ ను ఇరాన్ కూల్చేసిందని ఆరోపిస్తూ అమెరికా ఇరాన్ పై భీకర దాడులకు పాల్పడింది. హెలికాప్టర్ ను కూల్చేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనీ, ప్రతీకార దాడులు చేస్తామనీ ట్రంప్ ట్రూత్ పోస్టు వేదికగా ప్రకటించారు. ట్రంప్ ప్రకటించినట్టుగానే యూఎస్ దాడులు తీవ్రతరం చేసింది.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుఝామున హార్మూజ్ జలసంధికి సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ అపాచీ హెలికాప్టర్ ను ప్రమాదానికి గురైంది. ఇరాన్ బలగానే దీనిని కూల్చేసాయని అమెరికా బలంగా నమ్ముతోంది. హెలికాప్టర్ లో సైనికులను రక్షించామనీ, ఘటనపై విచారణ జరుపుతున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే కొన్ని గంటల తర్వాత ట్రంప్ ట్రూత్ పోస్టులో ఇరాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్ ఆదేశాలతో మంగళవారం రాత్రి నుంచే యూఎస్ ఎయిర్‌ఫోర్స్, నేవీ ఇరాన్ పై విరుచుకుపడ్డాయి. ఇరాన్ కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. ఈ దాడులకు సంబంధించి యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో వివరాలు వెల్లడించింది. తమ అధ్యక్షుడి ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడులను మొదలెట్టినట్టు తెలిపింది.
యూఎస్ ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ ను కూల్చివేసినందుకు ప్రతిచర్యగానే ఈ దాడులు చేసామనీ, ఇరాన్‌కు అమెరికా ఇచ్చే సరైన సమాధానం ఇదే అంటూ పోస్టులో రాసుకొచ్చింది. మరోవైపు అమెరికా ప్రతీకార దాడులపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. అమెరికా తమ సంకల్పాన్ని పరీక్షిస్తోందనీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
తమ సాయుధ దళాలు అమెరికాకు దీటుగా బదులిస్తాయనీ హెచ్చరించారు. వారు సురక్షితంగా ఉండాలనుకుంటే తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా గతంలో చొరబాటుదారులకు తాము బుద్ధి చెప్పిన కొన్ని సంఘటనలను గుర్తు చేశారు. దీంతో ఏ క్షణమైనా ఇరాన్ తిరిగి దాడులకు దిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
Director Bharathiraja : భారతీయ సినీపరిశ్రమలో విషాదం..దర్శకుడు భారతీరాజా కన్నుమూత
