Ram Gopal Varma : ఆర్జీవీ రూ.29.67 కోట్లు చెల్లించాలి..ఎక్లాటెంట్ ఫిల్మ్స్ పబ్లిక్ నోటీసు

Ram Gopal Varma : ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా రూ. 29.67 కోట్ల ఆర్థిక వివాదంలో చిక్కుకున్నారు. ఎక్లాటెంట్ ఫిల్మ్స్ కంపెనీ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Ram Gopal Varma

టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి పెద్ద వివాదంలో నిలిచారు. వర్మ భారీ మొత్తంలో తమకు బకాయిలు పడ్డారంటూ ఎక్లాటెంట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ.. పబ్లిక్ నోటీసు జారీ చేయడం టాలీవుడ్ , బాలీవుడ్‌ను కుదిపేసింది.

తమకు ఆర్జీవీ(Ram Gopal Varma) అసలు మరియు వడ్డీ కలుపుకొని మొత్తం రూ. 29.67 కోట్లు చెల్లించాల్సి ఉందని, రేపు అంటే అక్టోబర్ 30వ తేదీలోగా ఆ మొత్తాన్ని తమకు క్లియర్ చేయాలని ఆ సంస్థ డెడ్‌లైన్ విధించింది. ఇప్పటికే వర్మకు దీనిపై అక్టోబర్ 15వ తేదీన లీగల్ నోటీసులు పంపినట్లు కూడా వివరించింది.

ఎక్లాటెంట్ ఫిల్మ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒకసారి చూస్తే.. 2010 ఏప్రిల్ 10వ తేదీన రెండు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2013వ సంవత్సరంలో బాంబే హైకోర్టు కూడా గతంలో గుర్తించింది. ఈ మొత్తం బకాయిల్లో కేవలం ఇంట్రస్ట్‌నే రూ. 11.38 కోట్లకు పైగా ఉందని నోటీసులో మెన్షన్ చేశారు.

గడువులోకా ఆ డబ్బు చెల్లించకపోతే, ఒప్పంద నిబంధనల ప్రకారం ఆర్జీవీ(Ram Gopal Varma) మూవీలు, ప్రాజెక్టులపై తమకు పూర్తి చట్టపరమైన హక్కులు లభిస్తాయని సంస్థ హెచ్చరించింది. దీనివల్ల వర్మ మూవీల ద్వారా వచ్చే ఇన్కమ్, షేర్స్ ఆ సంస్థ కంట్రోల్‌లోకి వెళ్లే అవకాశం ఉంది.

అంతేకాదు ఇకపై ప్రొడ్యూసర్లు , డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, బ్రాడ్‌కాస్టర్లు ఎవరైనా సరే.. ముందుగా ఎక్లాటెంట్ ఫిల్మ్స్ నుంచి ముందస్తు నిరభ్యంతర పత్రం (NOC) తీసుకోకుండా రామ్ గోపాల్ వర్మతో ఎలాంటి ఆర్థిక, వ్యాపార లావాదేవీలు జరపకూడదని సంస్థ హెచ్చరించింది. ఒకవేళ ఎన్‌ఓసీ లేకుండా ఎవరైనా వ్యవహరిస్తే మాత్రం ఫ్యూచర్‌లో జరిగే నష్టాలకు , చట్టపరమైన పరిణామాలకు కూడా వారే బాధ్యులవుతారని ఆ సంస్థ తేల్చిచెప్పేసింది.

Maturity : నిజమైన మెచ్యూరిటీ అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

↑
Exit mobile version