Ghee Scandal
తిరుమల శ్రీవారి లడ్డూల కోసం నకిలీ నెయ్యి (Ghee Scandal)సరఫరా చేశారనే ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT), ఈ కేసులో కీలక వ్యక్తి అయిన టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణను పూర్తి చేసింది.
మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని SIT అధికారులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. ఇది ఈ కేసు దర్యాప్తులో ఒక కీలక ఘట్టం. SIT బృందం, ఈ సుదీర్ఘ విచారణలో ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో రికార్డ్ చేసింది. ఈ స్టేట్‌మెంట్, రూ.250 కోట్ల విలువైన ఈ స్కాం వెనుక ఉన్న నిర్ణయాలు ,అంతర్గత వ్యవహారాలను తెలుసుకోవడంలో కీలకం కానుంది.
టీటీడీకి నకిలీ నెయ్యి(Ghee Scandal)సరఫరా జరిగిన 2019–2024 మధ్య కాలంలో ఆయన ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో, టెండర్ల షరతుల మార్పులు, బ్లాక్‌లిస్ట్ చేసిన కంపెనీలు ప్రాక్సీ డైరీల ద్వారా తిరిగి సప్లై చేయగలిగేలా అంతర్గతంగా జరిగిన ఏర్పాట్లు, నెయ్యి నాణ్యత (క్వాలిటీ) పరీక్షల్లో లోపాలు (lapses) వంటి అంశాలపై ఆయనను ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌కు చెందిన Bhole Baba Organic Dairy అనే కంపెనీ, అసలు పాలు లేకుండా నకిలీ డెసి గీ తయారు చేసి, ప్రాక్సీ కంపెనీల ద్వారా టీటీడీకి సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని (సుమారు రూ. 250 కోట్లు విలువ) సరఫరా చేసింది.
ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు ఉన్న 5-సభ్యుల SIT దర్యాప్తును వేగవంతం చేసింది.
ఈ కేసులో రెండవ నిందితుడిగా (A2) ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఈవో A.V. ధర్మారెడ్డిని సిట్ ఇటీవల విచారించింది. సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా ఉన్న కాలంలోనే ధర్మారెడ్డి కీలకమైన AEO/EO పదవుల్లో ఉన్నారు.
ధర్మారెడ్డిని సైతం టెండర్ల షరతుల మార్పులు, ముఖ్యంగా 2020లో ‘milk’ పదాన్ని టెండర్ నుంచి తొలగించడం, వంటి కీలక పాలనా నిర్ణయాలపై SIT ప్రశ్నించింది.
కొనుగోళ్లు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సిఫార్సుల ఆధారంగానే జరిగాయని సుబ్బారెడ్డి , ధర్మారెడ్డి ఇద్దరూ బాధ్యతను కమిటీ వైపు మళ్లించేలా స్టేట్‌మెంట్ ఇచ్చారనే వార్తలు వచ్చాయి.
సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలతో పాటు Bhole Baba Dairy డైరెక్టర్లు, ప్రాక్సీ డైరీల నిర్వాహకుల విచారణ ముగియడంతో.. SIT త్వరలో ఫైనాన్షియల్ ట్రైల్స్, టెండర్ డాక్యుమెంట్ల ఆధారంగా చార్జ్‌షీట్ దాఖలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ చార్జ్‌షీట్‌లో ఎవరిపై సీరియస్ కేసులు నిలబడతాయి, ఎవరు తప్పించుకున్నారనే వివరాలు వెల్లడి కానున్నాయి.
