Anchor Shiva Jyothi :టీటీడీ కఠిన నిర్ణయం.. క్షమాపణలు చెప్పినా యాంకర్ శివ జ్యోతికి తప్పని నిషేధం

Anchor Shiva Jyothi :క్యూలైన్‌లో ఉన్న సమయంలో శివ జ్యోతి "మేము రిచెస్ట్ బెగ్గర్లం (Richest Beggars), స్వామి ప్రసాదం అడుక్కుంటున్నాం" అంటూ మాట్లాడింది.

Anchor Shiva Jyothi

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శివ జ్యోతి(Anchor Shiva Jyothi)కి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శివ జ్యోతికి శ్రీవారి దర్శనాలపై జీవితకాల నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇటీవల శివ జ్యోతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లారు. అక్కడ దర్శనం క్యూలైన్‌లో నిల్చొని తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం ఒక వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

క్యూలైన్‌లో ఉన్న సమయంలో శివ జ్యోతి “మేము రిచెస్ట్ బెగ్గర్లం (Richest Beggars), స్వామి ప్రసాదం అడుక్కుంటున్నాం” అంటూ మాట్లాడింది. సాధారణంగా, బెగ్గర్ అనే పదం చాలా నెగెటివ్ అర్థాన్ని సూచిస్తుంది. భక్తితో, పవిత్రంగా ఉండే తిరుమల దర్శనం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంస్థల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.

Anchor Shiva Jyothi (1)

శివ జ్యోతి(Anchor Shiva Jyothi) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, భక్తులు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. స్వామివారి పట్ల భక్తి లేనివారు ఇలాంటి పవిత్ర స్థలాల గురించి తేలికగా మాట్లాడటం సరికాదని, టీటీడీ వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ విషయం టీటీడీ బోర్డు దృష్టికి కూడా వెళ్లింది.

వివాదం తీవ్రతరం కావడంతో, శివ జ్యోతి వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆమె ఒక వీడియో విడుదల చేస్తూ భక్తులందరికీ క్షమాపణలు చెప్పింది.

“నేను మాట్లాడింది తప్పు. అందుకు ముందుగా భక్తులందరికీ నా క్షమాపణలు చెబుతున్నాను. నేను అలా అనకుండా ఉండాల్సింది. కానీ, నేను వేరే ఏ దురుద్దేశంతో అలా అనలేదు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. చాలా కాలం తరువాత పుట్టబోతున్న ఈ నా బిడ్డను కూడా ఆ స్వామి దయ వల్లే ఇచ్చాడు” అంటూ భావోద్వేగానికి లోనైంది.

Anchor Shiva Jyothi (1)

అయితే, ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, టీటీడీ బోర్డు మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించింది. పవిత్ర క్షేత్రంలో ఉండి, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అది కూడా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని బోర్డు భావించింది.

టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, శివ జ్యోతి (Anchor Shiva Jyothi)ఆధార్ కార్డును బ్లాక్ చేశారు. దీని అర్థం ఏంటంటే, ఆమె తన ఆధార్ నంబర్‌ను ఉపయోగించి భవిష్యత్తులో తిరుమలలో శ్రీవారి దర్శనం టికెట్లు కానీ, వసతి కానీ బుక్ చేసుకోవడానికి వీలుండదు. ఇది దాదాపుగా ఆమె తిరుమల దర్శనాలకు పర్మనెంట్ బ్యాన్ విధించినట్లే.

ఈ చర్య ఇతర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ఒక హెచ్చరికగా నిలుస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఉండేటప్పుడు భక్తుల మనోభావాలను గౌరవించాలని, ప్రచారానికి మించిన భక్తి భావనతో వ్యవహరించాలని టీటీడీ స్పష్టమైన సంకేతాలు పంపింది.

Bandaru Laddu: జీవితంలో ఒక్కసారయినా టేస్ట్ చూడాల్సిన స్వీట్..బందరు లడ్డు

Exit mobile version