Sricharani: క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా

Sricharani: భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ..రూ. 2.5 కోట్ల నగదు బహుమతిని అందించింది.

Sricharani

భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవల ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచకప్‌ను తొలిసారిగా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి (Sricharani) కి రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు అద్భుతమైన పురస్కారాలను ప్రకటించారు.

భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన శ్రీచరణి(Sricharani)కి ఏపీ ప్రభుత్వం ..రూ. 2.5 కోట్ల నగదు బహుమతిని అందించింది.అత్యున్నత స్థాయి గ్రూప్-1 కేడర్ ఉద్యోగం..ఆమె స్వస్థలం కడపలో నివాసం కోసం ఒక ఇంటి స్థలం కేటాయిస్తున్నారు.

Sricharani

ఈ శుక్రవారం ఉదయం శ్రీచరణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వీరికి స్వాగతం పలికారు.

వన్డే ప్రపంచకప్ గెలిచినందుకు సీఎం చంద్రబాబు , మంత్రి లోకేష్‌లు శ్రీచరణిని అభినందించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, శ్రీచరణి ప్రదర్శన మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. శ్రీచరణి ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలుచుకున్న మధుర క్షణాలను వారితో పంచుకున్నారు.

Sricharani

అంతకుముందు, ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ (SAAP) ఛైర్మన్ రవినాయుడు తదితరులు ఘన స్వాగతం పలికారు.

21 ఏళ్ల శ్రీచరణి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, జట్టు విజయానికి గట్టి పునాది వేసింది.ఈ టోర్నీలో శ్రీచరణి మొత్తం 9 మ్యాచ్‌లలో 4.96 ఎకానమీ రేటుతో 14 వికెట్లు తీసింది. ముఖ్యంగా సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో ఆమె చూపిన కట్టుదిట్టమైన బౌలింగ్, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయడంలో విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమ్ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆమె రెండో స్థానంలో నిలిచింది.

Sricharani

శ్రీచరణి సాధించిన ఈ విజయం, ఆమెకు లభించిన భారీ ప్రోత్సాహం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు , మహిళా అథ్లెట్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. . ప్రభుత్వం ప్రకటించిన ఈ నజరానా, ఆమె భవిష్యత్తు కెరీర్‌కు మరియు వ్యక్తిగత జీవితానికి భద్రత కల్పిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version