IT revolution:ఏపీలోనూ అదే టెక్ సునామీ..చంద్రబాబు మార్క్ ఐటీ విప్లవం కనిపిస్తోందా?

IT revolution: హైటెక్ సిటీ అనే ఒక విత్తనం నాటి, దాన్ని మహావృక్షంగా మార్చి లక్షలాది మందికి ఉపాధిని కల్పించిన ఆ విజన్, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌లో అంతకంటే వేగంగా పునరావృతమవుతోంది.

IT revolution

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడుది. హైటెక్ సిటీ అనే ఒక విత్తనం నాటి, దాన్ని మహావృక్షంగా మార్చి లక్షలాది మందికి ఉపాధిని కల్పించిన ఆ విజన్, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌లో అంతకంటే వేగంగా పునరావృతమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తాను అల్లారుముద్దుగా పెంచుకున్న హైదరాబాద్ దూరం కావడంతో కలిగిన ఆవేదనను, ఇప్పుడు ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చాలనే పట్టుదలగా మార్చుకున్నారు చంద్రబాబు. ఒకప్పుడు ఐటీ అంటే కేవలం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మాత్రమే గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు అమరావతి, విశాఖపట్నం జంట నగరాలుగా ఐటీ రంగంలో ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమవుతున్నాయి.

విశాఖపట్నం విషయంలో చంద్రబాబు వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. వైజాగ్‌ను కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా, సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఐటీ (IT revolution)హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ కేవలం చర్చలు జరగడం లేదు, దిగ్గజ సంస్థల కార్యాలయాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సిద్ధమవుతున్నాయి. గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలకు ఓకే చెప్పిందంటే కారణం చంద్రబాబు పట్టుదల, క‌ృషే కారణం. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు విజన్ తెలిసిన టెక్ దిగ్గజ సంస్థలన్నీ విశాఖకు క్యూ కడుతున్నాయి.

రుషికొండ, కాపులుప్పాడ వంటి ప్రాంతాలలో ఐటీ లేఅవుట్లు సిద్ధమయ్యాయి. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సుల ద్వారా వచ్చిన ఒప్పందాలు ఇప్పుడు ఆఫీసులుగా మారుతున్నాయి. రాబోయే రెండేళ్లలో వైజాగ్ ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్‌తో పోటీ పడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. వేల సంఖ్యలో ఐటీ నిపుణులు బెంగళూరు, హైదరాబాద్ వదిలి వైజాగ్ వైపు చూస్తున్నారు. ఇక్కడి వాతావరణం, సముద్ర తీరం ,ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. విశాఖను డేటా సెంటర్ల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం అదానీ గ్రూప్ వంటి సంస్థలతో కలిసి భారీ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది.

హైదరాబాద్‌లో ఐటీ(IT revolution)తో చరిత్ర సృష్టించిన బాబు, ఇప్పుడు అమరావతిలో అంతకంటే పది రెట్లు వేగవంతమైన క్వాంటం టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. ఐటీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే, క్వాంటం అనేది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాలలో పరిశోధనలు చేసేందుకు అమరావతిలో ఒక ప్రత్యేక జోన్‌ను చంద్రబాబు డిజైన్ చేశారు. ఇది అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి పోటీగా నిలవబోతోంది.

IT revolution

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్వాంటం నిపుణులను అమరావతికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక్కడ కేవలం సాఫ్ట్‌వేర్ రాయడమే కాదు, ప్రపంచాన్ని మార్చే కొత్త టెక్నాలజీలను కనిపెట్టే రీసెర్చ్ సెంటర్లు రాబోతున్నాయి. అమరావతిని కేవలం ఒక రాజధానిగా మాత్రమే కాకుండా, ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా మార్చాలన్నది బాబు సంకల్పం. దీనివల్ల ఏపీ యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే అవసరం లేకుండా, ఇక్కడే గ్లోబల్ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయి.

ఏం చేసినా ఎన్ని చేసినా హైదరాబాద్‌ ఐటీ(IT revolution) రంగంతో ఏపీ పోటీపడగలదా అంటే..కచ్చితంగా సాధ్యమే అంటున్నారు నిపుణులు! ఎందుకంటే చంద్రబాబు తన మనసులో ఉన్న ఆ లోటును అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా భర్తీ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఆయన వేసిన పునాదులు ఇప్పుడు ఏపీలో ఒక నూతన విప్లవానికి నాంది పలికాయి. ఈ ప్రాజెక్టులు కేవలం కాగితాల మీద లేవు. చంద్రబాబు స్వయంగా గ్లోబల్ సీఈఓలతో సమావేశమవుతూ, వారానికి ఒకసారి ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తున్నారు. ఏపీని స్టార్టప్ స్టేట్‌గా మార్చాలనేది ఆయన ప్రధాన లక్ష్యం. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కంపెనీలకు అనుమతులు ఇవ్వడం, ఐటీ పాలసీలో భారీ రాయితీలు ప్రకటించడం ద్వారా ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చేశారు.

ఒకప్పుడు హైటెక్ సిటీని నిర్మించేటప్పుడు కూడా చాలా మంది విమర్శించారు, కానీ ఈరోజు హైదరాబాద్ తలరాతే మారిపోయింది. ఇప్పుడు అమరావతి , విశాఖపట్నం విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ కాబోతోందంటున్నారు నిపుణులు. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల లాంటి వారితో చంద్రబాబుకు ఉన్న అనుబంధం ఏపీకి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లను తెచ్చిపెడుతోంది.

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఐటీ విప్లవం అంటే అది చంద్రబాబు నాయుడి పేరే. హైదరాబాద్ హైటెక్ సిటీ ఒక మైలురాయి అయితే, అమరావతి క్వాంటం వ్యాలీ, వైజాగ్ ఐటీ హబ్ అనేవి చంద్రబాబు కెరీర్‌లోనే అతిపెద్ద విజయాలుగా నిలవబోతున్నాయి. ఐటీ అంటే ఇకపై కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా అని గర్వంగా చెప్పుకునేలా పరిస్థితులు మారుతున్నాయి. విభజన కష్టాల నుంచి గ్లోబల్ సక్సెస్ వైపు ఏపీ అడుగులు వేస్తోంది. ఇది నవ్యాంధ్ర యువతకు ఒక గొప్ప భరోసా! రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక టెక్నాలజీ కేపిటల్ గా అవతరించడం ఖాయం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version