Nagarjuna
ఇప్పుడు అక్కినేని నాగార్జున(Nagarjuna) కెరీర్‌లో వందో మైలురాయి మూవీపై సినీ వర్గాల్లో ఓ రేంజ్‌లో చర్చ నడుస్తోంది. తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ మన్మథుడు, వందో సినిమాను మరుపురాని అనుభూతిగా మార్చడానికి ఫిక్స్ అయ్యారు.
తమిళ డైరెక్టర్ రా.కార్తీక్ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీ గురించి ఇప్పుడు తాజా ముచ్చట్లు బయటకు వచ్చాయి. ఈ మూవీ కోసం పాత జ్ఞాపకాలను తట్టిలేపేలా వింటేజ్ లుక్‌తో పాటు, లేటెస్ట్ స్టైలిష్‌నెస్ ను కలగలిపి నాగ్ కనిపించనున్నారని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి డైరెక్టర్ కార్తీక్ రీసెంట్‌గా పంచుకున్న విషయాలు నాగార్జున ఫ్యాన్స్‌లో.. సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాను ఒకే గెటప్‌కు పరిమితం కాకుండా, స్టోరీ లైన్‌ను బట్టి డిఫరెంట్ గెటప్‌లతో ఆకట్టుకుంటారని నాగ్ స్పష్టం చేశారు.
ముఖ్యంగా శివ, రక్షకుడు వంటి క్లాసిక్ సినిమాల్లో నాగ్ చూపిన ఆ పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్ , గ్రేస్ ఇప్పుడు ఈ వందో సినిమాలో ప్రతిబింబించనున్నాయని కార్తీక్ పేర్కొనడం విశేషం. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో మైసూర్ పరిసరాల్లో కీలక సీన్స్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీపై నాగార్జున(Nagarjuna) ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
అయితే, పరభాషా డైరెక్టర్లతో తెలుగు టాప్ హీరోలు మూవీలు చేసినప్పుడు కొన్నిసార్లు ఆశించిన రిజల్ట్ రావడం లేదనే సెంటిమెంట్ నెట్టింట వినిపిస్తోంది. దీనిపై డైరెక్టర్ కార్తీక్ స్పందిస్తూ ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. నాగార్జునను నేరుగా తాను అడిగినప్పుడు నాగ్ ఇచ్చిన ఆన్సర్ తనలో మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు.
టాలెంట్ ఉంటే ఏ ప్రాంతం వారైనా ఫర్వాలేదని.. కేవలం స్టోరీలో ఉన్న లోతును మాత్రమే చూసి ఈ ఛాన్స్ ఇచ్చానని నాగార్జున చెప్పిన తీరును కార్తీక్ ప్రస్తావించారు. గతంలో మణిరత్నం వంటి మేధావులతో గీతాంజలి వంటి అద్భుతాలు సృష్టించిన నాగార్జున, ఈసారి కూడా ఒక కొత్త డైరెక్టర్‌ని నమ్మి సాహసం చేస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎంపికపై కూడా వస్తోంది. సీనియర్ నటి టబు , నాట్యం ఫేమ్ సుస్మితా భట్ ఈ ప్రాజెక్టులో పార్టనర్షిప్ కానున్నారని, మూడో హీరోయిన్ విషయంలో త్వరలోనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో ఈ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్.. అంటే 2026 దసరా పండుగ వేళ వెండితెరపై సందడి చేయనుంది. వింటేజ్ నాగార్జునను మళ్లీ చూడాలని ఆశపడుతున్న నాగ్ ఫ్యాన్స్‌కు, ఈ వందో సినిమా ఒక పండుగలా ఉండబోతోందని చెప్పడంలో సందేహం లేదు.
