Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, రాష్ట్ర నాయకత్వం నుంచి ఘన సత్కారాలు అందుకున్నారు. ఈ పర్యటన ముగింపులో ఆయన చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలపై, అభివృద్ధిపై ఉన్న కేంద్రీకృత దృష్టిని తెలియజేసింది.
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/YICBX9ILhe
— Narendra Modi (@narendramodi) October 16, 2025
ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌లోని గద్దలేటి వేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని శాలువాతో సత్కరించారు. అనంతరం, వారు మహాశివుడి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ సంస్కృతి , ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది.
ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి , ప్రధాని ఒకే వేదికపై కనిపించడం సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ఐక్యతను , కేంద్రంతో ఉన్న బలమైన అనుబంధాన్ని నొక్కి చెప్పింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రధాని మోదీకి “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పేరుతో రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలపై ఒక ప్రత్యేక పుస్తకాన్ని అందజేశారు. ఈ ప్రచారం ద్వారా రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ రేట్ల తగ్గింపు, దానివల్ల లభించే ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకమని మంత్రి లోకేష్ ప్రధానికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉండగానే ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటనపై తన అభిప్రాయాన్ని X వేదిక ద్వారా పంచుకున్నారు.
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నానని మోదీ ట్వీట్ చేశారు. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించానని.. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు