Liquor : మందుబాబులకు గుడ్ న్యూస్: ఏపీలో కొత్త మద్యం పాలసీ రెడీ

Liquor : బార్లకు లాటరీ, పర్మిట్ రూమ్‌లకు గ్రీన్ సిగ్నల్: ఏపీ కొత్త లిక్కర్ పాలసీ ఇదేనా?

Liquor

మందుబాబులకు గుడ్ న్యూస్ వినిపించనుంది. ప్రస్తుతం ఉన్న బార్ల పాలసీ(Bar Policy) గడువు ఈ నెల 30తో ముగుస్తున్నందున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పాలసీపై దృష్టి పెట్టింది. కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్(Liquor ) పాలసీతో రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచడంతో పాటు, ప్రజలకు బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా, కొత్త బార్ల పాలసీని రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది.

కొత్త బార్ల పాలసీలో ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

లాటరీ విధానం: గతంలో జగన్ ప్రభుత్వం వేలం విధానంలో బార్లకు లైసెన్సులు కేటాయించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. గతంలో మద్యం(Liquor )షాపులను లాటరీ విధానంలో కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. అదే తరహాలో ఇప్పుడు బార్ల లైసెన్సులను కూడా లాటరీ ద్వారా కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రెండు రకాల ఫీజు ప్రతిపాదనలు: కొత్త పాలసీలో లైసెన్స్ ఫీజులపై రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి:

మొదటి ప్రతిపాదన: నగర పంచాయతీల్లో రూ.35 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.40 లక్షలు, కార్పొరేషన్లలో రూ.45 లక్షలు ఫీజుగా నిర్ణయించడం. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ప్రస్తుతం ఉన్న 840 బార్ల సంఖ్యను 1,000కు పెంచే అవకాశం ఉంది.

రెండో ప్రతిపాదన: నగర పంచాయతీల్లో రూ.55 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.65 లక్షలు, కార్పొరేషన్లలో రూ.75 లక్షలు ఫీజుగా పెట్టాలని ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలో బార్ల సంఖ్య యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. అయితే, ఫీజులు తగ్గించి, బార్ల సంఖ్య పెంచే మొదటి ప్రతిపాదనకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ కొత్త పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

liquor

మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌ల ఏర్పాటు?
కొత్త బార్ల (Liquor )పాలసీతో పాటు, మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి అందింది. బార్లలో ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మద్యం షాపుల వద్దనే పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేస్తే మద్యం ప్రియులకు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ఈ నిర్ణయం బార్ల ఆదాయంపై ప్రభావం చూపినా, కొన్ని నిబంధనలతో పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే మద్యం ప్రియులకు నిజంగా పండుగే అవుతుంది.

Also Read: Government jobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త: ఏకంగా 27,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు

 

 

Exit mobile version