Sankranti holidays
తెలుగు వారి అతిపెద్ద, అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటైన సంక్రాంతి (Sankranti) కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ ఏటా సంక్రాంతికి విద్యాసంస్థలకు భారీగా సెలవులు వస్తుండగా, ఈసారి కూడా స్కూళ్లకు ఎక్కువ రోజులే సెలవులు రానున్నాయి.
సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే శుభసమయం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమణమని అంటారు. ఉత్తరాయణంలో సూర్యరశ్మి ప్రచండంగా ఉండటం వల్ల, దక్షిణాయనంలో వచ్చే వర్షాలు, చలి , రోగాలకు ముగింపు పలుకుతుంది. తెలుగు లోగిళ్లు ఈ సమయంలో ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడి పందేలు (కొన్ని ప్రాంతాల్లో), భోగి మంటలతో శోభాయమానంగా కనిపిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఈసారి సంక్రాంతి సెలవులు కాస్త ఎక్కువ రోజులే వచ్చాయి. జనవరి 10, 2026 శనివారం నుంచి సెలవులు ప్రారంభమయి.. జనవరి 18, 2026 ఆదివారంతో ఈ సెలవులు ముగుస్తాయి. మొత్తం సెలవులు 9 రోజులు పాటు ఉండగా..జనవరి 19, 2026 సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కూడా పాఠశాలలకు సంక్రాంతి సెలవులు(Sankranti holidays )రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరచుగా సంక్రాంతికి ఏపీ కంటే కొంచెం తక్కువ రోజులు సెలవులు ఇస్తుంటుంది.జనవరి 10, 2026 నుంచి జనవరి 15, 2026వ తేదీ వరకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాయి.
సంక్రాంతి సెలవులు(Sankranti holidays)కాకుండా, జనవరి నెలలో ఇతర ముఖ్యమైన సెలవులు కూడా ఉన్నాయి. జనవరి 23 (శుక్రవారం): వసంత పంచమి / సరస్వతి పూజ, సుభాష్ చంద్రబోస్ జయంతి అలాగే జనవరి 26 (సోమవారం) గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజు హాలీడే ఉంటుంది.
