Journey
తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్ టూ అమరావతి మధ్య ప్రయాణం (Journey)ఇకపై మరింత ఈజీ కాబోతోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో నిర్మిస్తున్న నేషనల్ హైవే (NH-167G) పనులు పూర్తయితే, ఈ రెండిటి మధ్య ప్రయాణ (Journey)దూరం గణనీయంగా తగ్గడమే కాకుండా, సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయాణికులతో పాటు సరుకు రవాణా చేసే లారీలకు కూడా పెద్ద ఊరట లభిస్తుంది.
కొత్త హైవే (NH-167G) వివరాలు..గుంటూరు జిల్లా పేరేచర్ల నుంచి పల్నాడు జిల్లా కొండమోడు వరకు దాదాపు 49.91 కిలోమీటర్ల వరకూ ఈ కొత్త హైవేను నిర్మిస్తున్నారు. దీనికోసం రూ. 881.61 కోట్లు వెచ్చిస్తున్నారు.
2027 ఏప్రిల్ కల్లా ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గంలో సత్తెనపల్లి ,కొండమోడు వద్ద భారీ బైపాస్ రోడ్లు నిర్మించడం వల్ల నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలు వేగంగా వెళ్లొచ్చు.
దూరం, గంటల్లో మార్పు (పాత vs కొత్త).. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమరావతి లేదా గుంటూరు వెళ్లాలంటే సూర్యాపేట, మిర్యాలగూడ మీదుగా లేదా విజయవాడ మీదుగా వెళ్తుంటారు.
పాత దూరం సాధారణంగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఉన్న దూరం సుమారు 270 నుంచి 280 కిలోమీటర్లు. దీనికి పట్టే సమయం సుమారు 5 నుంచి 6 గంటలు.
కొత్త హైవే వల్ల మార్పు.. పేరేచర్ల-కొండమోడు హైవే అందుబాటులోకి వస్తే అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అంటే సుమారు 45 నిమిషాల నుంచి 1 గంట సమయం ఆదా అవుతుంది.
ఖమ్మం-వైరా గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రభావం..ఖమ్మం- వైరా మీదుగా వేసిన గ్రీన్‌ఫీల్డ్ హైవే (నాగ్‌పూర్ – విజయవాడ కారిడార్‌లో భాగం) కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
దూరం ఆదా.. ఈ హైవే వల్ల హైదరాబాద్ – విజయవాడ మధ్య కాకుండా, ఉత్తర తెలంగాణ , ఏపీ మధ్య దూరం దాదాపు 60 కిలోమీటర్ల వరకు తగ్గింది.
సమయం ఆదా.. గ్రీన్‌ఫీల్డ్ హైవేలు కాబట్టి, ఇక్కడ వాహనాల వేగ పరిమితి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గతంలో కంటే దాదాపు 2 గంటల ప్రయాణ సమయం తగ్గింది. ముఖ్యంగా ఖమ్మం నుంచి విజయవాడకు ఇప్పుడు కేవలం 1.5 గంటల్లోనే చేరుకునే అవకాశం కలిగింది.
1. కొత్త హైవే (NH-167G):
-
మార్గం: పేరేచర్ల – కొండమోడు
-
దూరం ఆదా: 40 కిలోమీటర్లు
-
సమయం ఆదా: 1 గంట
-
పూర్తయ్యే కాలం: 2027 ఏప్రిల్
2. ఖమ్మం – వైరా గ్రీన్‌ఫీల్డ్ హైవే:
-
మార్గం: నాగ్‌పూర్ – విజయవాడ కారిడార్
-
దూరం ఆదా: 60 కిలోమీటర్లు
-
సమయం ఆదా: 2 గంటలు
-
ప్రత్యేకత: హై-స్పీడ్ ప్రయాణం
ఎకనామిక్ బెనిఫిట్స్..ఈ హైవేల వల్ల కేవలం ప్రయాణికులే కాదు, వ్యాపార రంగం కూడా పుంజుకుంటుంది. పల్నాడు ప్రాంతం నుంచి పత్తి, మిర్చి , కంకర రవాణా చేసే వాహనాలకు ఇంధన ఖర్చు తగ్గుతుంది. తక్కువ సమయంలో సరుకులు మార్కెట్లకు చేరుతాయి. ఎన్హెచ్-167జీ లో భాగంగా నిర్మిస్తున్న 11 చిన్న బ్రిడ్జిలు, 4 అండర్ పాస్‌లు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చనున్నాయి.
మొత్తానికి 2027 నాటికల్లా ఈ పనులన్నీ పూర్తయితే హైదరాబాద్ – అమరావతి మధ్య ప్రయాణం (Journey) ఒక విలాసవంతమైన అనుభూతిని ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Yellow Jowar:చిరుధాన్యాల రారాజు పచ్చజొన్నలు.. షుగర్, బీపీ తగ్గాలంటే వీటిని తినాల్సిందే..
