LinkedIn: విశాఖ,విజయవాడల మెగా ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటో లింక్డ్ఇన్ చెప్పేసిందిగా..

LinkedIn:ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని తిరగరాసి, గేమ్ ఛేంజర్‌లుగా మారబోయే ఆ రెండు ధ్రువతారలే విశాఖపట్నం(Visakhapatnam), విజయవాడ(Vijayawada). ఈ విషయాన్నే ఇప్పుడు లింక్డ్‌ఇన్ (LinkedIn)సర్వే తేల్చి చెప్పింది.

LinkedIn: ఏపీలో ఒకవైపు ఆకాశాన్ని తాకే సముద్ర కెరటాలు గల ప్రాంతం.. మరోవైపు పచ్చని పొలాల గుండా ప్రవహించే జీవనది ఉండే ప్రాంతం.ఏపీకి ఇవి కేవలం ప్రకృతి ప్రసాదించిన వరాలు కావు.. అపరిమితమైన అవకాశాలకు, అద్భుతమైన భవిష్యత్తుకు బలమైన పునాదులు. విశాలమైన ప్రకృతి ఒడిలో, అపురూపమైన చరిత్రకు, ఉద్యమ స్ఫూర్తికి నిలయాలైన ఈ ప్రాంతాలు ఇప్పుడు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని తిరగరాసి, గేమ్ ఛేంజర్‌లుగా మారబోయే ఆ రెండు ధ్రువతారలే విశాఖపట్నం(Visakhapatnam), విజయవాడ(Vijayawada). ఈ విషయాన్నే ఇప్పుడు లింక్డ్‌ఇన్ (LinkedIn)సర్వే తేల్చి చెప్పింది.

LinkedIn:

టైర్-2, టైర్-3 కేంద్రాలు- ఉపాధి విప్లవానికి నాంది..
విశాఖపట్నం (టైర్-2), విజయవాడ (టైర్-3) కేవలం పేర్లు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త నిర్వచనం. విశాఖపట్నం పారిశ్రామిక కేంద్రంగా అనూహ్యంగా ఎదుగుతుంటే, విజయవాడ ఐటీ రంగంలో అడుగులు వేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రెండు ప్రాంతాలు ఉద్యోగ అవకాశాల సృష్టిలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిపుణులు ఇక్కడ తమ కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే ఈ వైజాగ్, విజయవాడ సిటీల ఇంపార్టెన్స్‌ను అర్థం చేసుకోవచ్చు. నిజంగా, ఇవి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చే గేమ్ ఛేంజర్‌లుగానే చెప్పొచ్చు.

టెక్, ఫార్మా, ఫైనాన్స్‌లో లింక్డ్‌ఇన్ సర్వే..
అంతర్జాతీయ ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ ఇటీవల నిర్వహించిన సర్వేలో విశేషమైన అంశాలు వెలుగు చూశాయి. ఈ రిపోర్ట్ ప్రకారం, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలలో టెక్నాలజీ, ఔషధ (ఫార్మా), ఆర్థిక సేవల (ఫైనాన్షియల్ సర్వీసెస్) రంగాలు అనూహ్యంగా వృద్ధి చెందుతున్నాయి. డేటా సైన్స్, ఏఐ (AI) వంటి లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఐటీ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.

విశాఖపట్నంలో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ వంటి సంస్థలు, విజయవాడలో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఇవి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తున్నాయి. ఔషధ రంగంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్, అలెంబిక్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, సన్ ఫార్మా వంటి ప్రముఖ సంస్థలు విశాఖపట్నంలో తమ ఉనికిని చాటుతున్నాయి. ఈ కంపెనీలలో స్థానికులు అత్యధిక సంఖ్యలో పనిచేస్తున్నారు, అందులోనూ చాలామంది ఉన్నత స్థాయి పొజిషన్లలో కొనసాగుతున్నారు. ఇది కేవలం జాబ్ అవకాశాలు మాత్రమే కాదు, నైపుణ్యాభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఏపీకి దేశవ్యాప్త గుర్తింపు- టాప్ ప్రాంతాల సరసన..
లింక్డ్‌ఇన్ నివేదిక దేశంలోని టైర్-2, టైర్-3 ప్రాంతాల వృద్ధిని కూడా హైలైట్ చేసింది. రాంచీ రెండవ స్థానంలో ఉండగా, నాసిక్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, ఆగ్రా, మధురై, వడోదర, జోధ్‌పూర్ వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు కూడా గుర్తింపు పొందాయి. ఈ పది ప్రాంతాలలో ఆరు ప్రాంతాలలో జాబ్ రిక్రూట్మెంట్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా, విశాఖపట్నం, విజయవాడ, మధురైలలో ఇంజనీరింగ్ రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్..
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ కార్యకలాపాలు, ఫార్మా కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాంతాలలో అపారమైన అవకాశాలు, అద్భుతమైన సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు వివరిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నిపుణులు ఇక్కడికి వలస రావడమే దీనికి తిరుగులేని నిదర్శనం. భవిష్యత్‌లో విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి, రాష్ట్ర అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌లుగా నిలుస్తాయని నిస్సందేహంగా చెప్పొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

Exit mobile version