Visakhapatnam Zoo:విశాఖ జూలో మెగా న్యూస్! ఆసియాటిక్ లయన్ బేబీస్ వస్తున్నాయా..?

విశాఖ జూ(Visakhapatnam Zoo) పవర్ కపుల్ అయిన పత్వాద్, మహేశ్వరి లవ్ స్టోరీ ఓసారి చూస్తే..జూలో ఉన్న సింహాల జంటలో, మగ సింహం పేరు పత్వాద్, దాని వయసు 12 ఏళ్లు. ఆడ సింహం పేరు మహేశ్వరి (కుమారి), దాని వయసు 4.5 ఏళ్లు.

Visakhapatnam Zoo

వరల్డ్ లయన్ డే (ఆగస్టు 10) సందర్భంగా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది! మన విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (IGZP)లో త్వరలో క్యూట్ క్యూట్ సింహ పిల్లలు పుట్టబోతున్నాయట. ఇప్పుడు జూలో ఉన్న సింహాల జంట బేబీస్ ప్లానింగ్‌లో ఉన్నారని జూ అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం మన జూకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అంతరించిపోతున్న ఆసియాటిక్ సింహాల సంరక్షణలో ఒక బిగ్ స్టోరీ, ఒక కొత్త అధ్యాయం అవుతుంది.

ఆసియాటిక్ లయన్ (Panthera leo persica) అనేది ఒక సూపర్ స్టార్ స్పీషిస్. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన సింహ జాతి. ప్రపంచం మొత్తం మీద ఇవి గుజరాత్‌లోని గిర్ అడవుల్లో మాత్రమే సహజంగా జీవిస్తాయి. ఇండియాలో మొత్తం 674+ మాత్రమే ఉన్నాయి. పెరుగుతున్న మానవ జోక్యం, అడవుల నరికివేత, వ్యాధులు వంటి అనేక కారణాల వల్ల ఈ విశిష్ట జాతి ప్రమాదంలో పడింది. అందుకే వీటిని కాపాడటానికి గుజరాత్‌లోని సక్కర్బాగ్ జూ వంటి కేంద్రాలు 2020 నుంచి 80కి పైగా పిల్లలను విజయవంతంగా పెంచి సంరక్షణలో టాప్‌లో ఉన్నాయి

Visakhapatnam Zoo

విశాఖ జూ(Visakhapatnam Zoo) పవర్ కపుల్ అయిన పత్వాద్, మహేశ్వరి లవ్ స్టోరీ ఓసారి చూస్తే..జూలో ఉన్న సింహాల జంటలో, మగ సింహం పేరు పత్వాద్, దాని వయసు 12 ఏళ్లు. ఆడ సింహం పేరు మహేశ్వరి (కుమారి), దాని వయసు 4.5 ఏళ్లు. ఈ పవర్ కపుల్ ఇప్పుడు పర్ఫెక్ట్ హెల్త్‌తో, ప్రొఫెషనల్ బ్రీడింగ్‌కు రెడీగా ఉన్నారని జూ అధికారులు చెబుతున్నారు. వీరికి పిల్లలు పుడితే, జూలో ఆసియాటిక్ సింహాల జనాభాలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రాజెక్ట్ లయన్” కింద గిర్ అడవుల వెలుపల కొత్త అభయారణ్యాలు, సింహాల జంటలను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు విశాఖ జూలో బ్రీడింగ్ విజయం సాధిస్తే, అది ఈ ప్రాజెక్ట్‌కు ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సింహాల జన్యు వైవిధ్యం పెరిగి, స్టడీ, కన్జర్వేషన్‌లో కొత్త శక్తి వస్తుంది.

ఆసియాటిక్ సింహాల జనాభా ఒకే చోట ఉండటం వల్ల భవిష్యత్తులో క్లయిమేట్, వ్యాధులు, ఎపిడెమిక్స్ వంటి ప్రమాదాల నుంచి వాటిని కాపాడటం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దేశంలో మరిన్ని స్వతంత్ర జనాభాలను అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు. సక్కర్బాగ్ జూ ప్రధాన కేంద్రంగా ఉండగా, విశాఖపట్నంలోని IGZP లాంటి జూలలో జరిగే విజయవంతమైన బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ఈ జాతీయ సంరక్షణ ప్రయత్నాలకు కొత్త దిశానిర్దేశం చేస్తాయి.

Visakhapatnam Zoo

ఈ సంవత్సరం వరల్డ్ లయన్ డే సందర్భంగా, విశాఖ జూ వచ్చిన క్రేజీ అప్ డేట్ యానిమల్ లవర్స్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది . ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ఈ గుడ్ న్యూస్ వినడం నిజంగా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సంవత్సరం సింహాల పిల్లలు జన్మిస్తే, అది మన దేశంలో సింహాల సంరక్షణలో ఒక బిగ్ మూమెంట్ అవుతుంది.

Exit mobile version