Epstein : ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం..క్షమించమన్న బిల్ గేట్స్

Epstein : అగ్రరాజ్యం అమెరికాలో వెలుగుచూసిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం కేవలం ఆ దేశాన్నే కాదు వేరే దేశాలకు చెందిన ప్రముఖులకు సైతం వణుకు పుట్టిస్తోంది.

Epstein

అగ్రరాజ్యం అమెరికాలో వెలుగుచూసిన ఎప్‌స్టీన్‌(Epstein) సెక్స్‌ కుంభకోణం కేవలం ఆ దేశాన్నే కాదు వేరే దేశాలకు చెందిన ప్రముఖులకు సైతం వణుకు పుట్టిస్తోంది. అసలు ఈ స్కాండిల్ వెలుగు చూసిన తర్వాత, ప్రముఖులందరిపైనా వచ్చిన ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా రేగిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ సెక్స్ కుంభకోణంలో వెలుగుచూసిన పేర్లలో క్లింటన్, బిల్ గేట్స్ , ట్రంప్ వంటి వారున్నారు.

ప్రస్తుతానికి ఇవి ఆరోపణలే అనుకున్నప్పటకీ ఎప్‌స్టీన్‌ ఫైల్స్(Epstein Files) పేరుతో వరుసగా విడుదలవుతున్న ఫోటోలు, వివరాలు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఇప్పట్లో ఈ ఫైల్స్ కు బ్రేక్ పడే అవకాశం లేదు. విడతల వారీగా దీనిని విడుదల చేస్తూనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే విడుదలైన ఫోటోల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అపర దానకర్ణుడిగా, ఉదార స్వభావిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న బిల్ గేట్స్ కూడా ఈ స్కాండిల్ ఉన్నారా అంటూ చాలా మంది షాక్ కు గురయ్యారు. ఈ కారణంగా తాను గేట్స్ తో విడిపోయానంటూ ఆయన భార్య వెల్లడించడం మరో సంచలనానికి దారితీసింది.

తాజాగా బిల్ గేట్స్ ఈ స్కాండిల్ పై స్పందించారు.అప్పటి విషయాన్ని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్(Epstein) లాంటి వివాదాస్పద వ్యక్తితో తాను గడిపిన క్షణాలపై పశ్చాత్తాపం చెందుతున్నట్టు చెప్పారు. అలాంటి వ్యక్తిని కలిసినందుకు బహిరంగంగానే అందరికీ క్షమాపణలు చెపుతున్నట్టు ప్రకటించారు. అయితే తాను ఎప్‌స్టీన్ రహస్య దీవుల్లా చెబుతున్న ప్రదేశానికి వెళ్లలేదంటూ గేట్స్ చెబుతున్నారు.

కాగా అమెరికా న్యాయశాఖ ఇటీవల లక్షలాది ఈ మెయిల్స్ , పలు పత్రాలు విడుదల చేసింది. దీనిలో జెఫ్రీ ఎప్‌స్టీన్ రాసినట్టుగా చెబుతున్న కొన్ని ఇమెయిల్స్‌లో.. బిల్‌గేట్స్ వివాహేతర సంబంధాల గురించి ప్రస్తావన ఉంది. బిల్ గేట్స్ రష్యా యువతులను కోరుకున్నారని, వారితో గడిపేందుకు తాను సహకరించానంటూ ఎప్‌స్టీన్ చెప్పిన అంశం కూడా ఉంది. రష్యన్ యువతులతో రహస్య భేటీ తానే ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. తన భార్యా మిలిండా గేట్స్ కు యాంటీ బయాటికస్ కూడా అడిగారని మెయిల్ లో పేర్కొన్నారు.

Epstein

అయితే తాను ఎలాంటి మెయిల్స్ పంపలేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. దురుద్దేశపూర్వకంగానే ఎప్‌స్టీన్ ఈ ఆరోపణలు చేసి, తన పేరు రాసారంటూ వ్యాఖ్యానించారు. అయినప్పటకీ ఎప్‌స్టీన్ తో తాను గడిపిన సమయంపై క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు.

ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండిల్ గురించి చూస్తే పేద, మధ్య తరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశగా చూపించి అఘాయిత్యాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఫ్లోరిడా, మెక్సికో న్యూయార్క్‌, వర్జిన్‌ ఐలాండ్స్‌ వంటి దీవుల్లో రహస్య నివాసాలకు పిలిపించి అకృత్యాలకు పాల్పడినట్టు మెయిల్స్ లో పేర్కొన్నారు.

పదేళ్ళకు పైగా నడిచిన ఈ చీకటి సామ్రాజ్యం గుట్టు 2005లో వెలుగుచూసింది. నిందితుడు ఎప్‌స్టీన్ అరెస్టు చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు. అనంతరం ఎప్‌స్టీన్ జైలులోనే అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది.

Women: మున్సిపల్ ఎన్నికల పోరులో మహిళా అభ్యర్ధులే ఎక్కువట..

Exit mobile version