Vastu:మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా? వాటిని సరిదిద్దుకోవడం ఎలా?

Vastu : ఈ రోజుల్లో చాలామందికి సొంతిల్లు అంటే అది అపార్ట్‌మెంట్‌లోనే దొరుకుతుంది. అయితే అపార్ట్‌మెంట్లలో మనకు నచ్చినట్లుగా గోడలు కట్టుకోవడం సాధ్యం కాకపోవడంతో.. దీనివల్ల చాలా చోట్ల వాస్తు దోషాలు ఏర్పడుతుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Vastu

ఈ రోజుల్లో చాలామందికి సొంతిల్లు అంటే అది అపార్ట్‌మెంట్‌లోనే దొరుకుతుంది. అయితే అపార్ట్‌మెంట్లలో మనకు నచ్చినట్లుగా గోడలు కట్టుకోవడం సాధ్యం కాకపోవడంతో.. దీనివల్ల చాలా చోట్ల వాస్తు దోషాలు ఏర్పడుతుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఈశాన్యంలో టాయిలెట్ ఉండటం అలాగే ఆగ్నేయంలో బెడ్ రూమ్ రావడం వంటివి ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలు తలెత్తడం ఖాయమని వాస్తు(Vastu) నిపుణులు చెబుతుంటారు. అయితే, అలాంటి పెద్ద పెద్ద మార్పులు చేయకుండానే పిరమిడ్లు , రంగుల (Color Therapy) ద్వారా ఈ దోషాలను ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పిరమిడ్లు విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీని గ్రహించి ఇంటి లోపల ప్రసరింపజేస్తాయని మెడిటేషన్ నేర్చుకున్న చోట్ల చాలామంది చెబుతూ ఉంటారు.అందుకే వాటికింద కూర్చుని కానీ, లేదా అది ఉన్న గదిలో కానీ మెడిటేషన్ చేయమని అంటారు.

అంతెందుకు ఆలయంలో దేవుడి సన్నిధానం ముందు కూర్చుని ధ్యానం చేయమని చెప్పడం వెనుక కూడా పిరమిడ్ కట్టడంతో నిర్మించిన ఆలయ నిర్మాణమేనని చెబుతారు.అందుకే అలాంటి పిరమిడ్‌తో గృహ దోషాలు తొలగించవచ్చని అంటున్నారు వాస్తు నిపుణులు.

ఇంట్లో ఏదైనా దిశలో లోపం కనుక ఉంటే, ఆ మూలలో లెడ్ పిరమిడ్ లేదా కాపర్ పిరమిడ్‌ను అమర్చడం వల్ల అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది.

సెంటర్ పాయింట్ (బ్రహ్మస్థానం).. అపార్ట్‌మెంట్ మధ్యలో బరువైన పిల్లర్లు ఉన్నా లేదా ఖాళీ లేకపోయినా, ఇంటి మధ్య భాగంలో ఒక పెద్ద పిరమిడ్‌ను అమర్చి ఆ వాస్తు(Vastu )దోషాన్ని తొలగించొచ్చట.

Vastu

అలాగే ప్రతి దిశకు ఒక నిర్దిష్టమైన రంగు ఉంటుంది. ఆ రంగులను ఉపయోగించడం ద్వారా దోష ప్రభావం పూర్తిగా తగ్గుతుందని అంటున్నారు.

ఈశాన్యం (North-East) దిశలో దోషం ఉంటే, ఆ గోడలకు లేత నీలం (Light Blue) రంగు వేయాలి. ఇది మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది.
ఆగ్నేయం (South-East) దిశలో ఇక్కడ కిచెన్ లేకపోతే, ఆ గదిలో ఆరెంజ్ కానీ లేత ఎరుపు రంగును ఉపయోగించాలి. ఇది అగ్ని తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.
నైరుతి (South-West)దిశలో లోపం ఉంటే పసుపు రంగును (Yellow) వాడటం వల్ల ఆ ఇంట్లో స్థిరత్వం లభిస్తుంది.

అలాగే అపార్ట్‌మెంట్లలో వెలుతురు, గాలి సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి. ఇంట్లో వాడిపోయిన మొక్కలను, విరిగిన వస్తువులను ఉంచకూడదు. కేవలం ఇలాంటి చిన్న చిన్న మార్పులతోనే మీ ఇంట్లో అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకురావచ్చని నిపుణులు అంటున్నారు.అయితే పిరమిడ్లను అమర్చే ముందు ఒకసారి వాస్తు నిపుణుడి సలహా తీసుకుంటే మంచిది.

Mana Shankara Varaprasad Garu:బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ..చరిత్ర తిరగరాసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Exit mobile version