New Bar Policy : కొత్త బార్ పాలసీ షురూ..ఎన్ని కీలక మార్పులున్నాయో తెలుసా?

New Bar Policy : ఈ కొత్త పాలసీ గత విధానంతో పోలిస్తే పలు కీలక మార్పులను కలిగి ఉండటంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

New Bar Policy

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారంపై ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఈ మేరకు కొత్త బార్ పాలసీ వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 840 బార్లకు అనుమతి ఇవ్వనున్నట్లు, కొత్త వ్యాపారులను ప్రోత్సహించడం, సిండికేట్లను అడ్డుకోవడమే ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. ఈ కొత్త పాలసీ గత విధానంతో పోలిస్తే పలు కీలక మార్పులను కలిగి ఉండటంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో బార్ లైసెన్స్(New Bar Policy) పొందాలంటే దరఖాస్తుదారులు ముందుగా రెస్టారెంట్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ నిబంధన కొత్త వారికి ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది. అయితే, కొత్త పాలసీలో ప్రభుత్వం ఈ నిబంధనను సడలించింది. ఇప్పుడు బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేవారు, లైసెన్స్ మంజూరైన 30 రోజుల్లోగా రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. ఇది కొత్త వ్యాపారులు సులభంగా ఈ రంగంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది.

అంతేకాకుండా, దరఖాస్తు రుసుమును కూడా తగ్గించారు. గతంలో కేటగిరీల ఆధారంగా రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉన్న అప్లికేషన్ ఫీజును, ఇప్పుడు అన్ని కేటగిరీలకు రూ.5 లక్షలకు తగ్గించారు. ఈ మార్పులు కొత్త దరఖాస్తుదారులను మరింతగా ఆకర్షించేందుకు ఉద్దేశించినవి.

కొత్త బార్ పాలసీ(New Bar Policy )లో లైసెన్స్ ఫీజు చెల్లింపులో కూడా గణనీయమైన మార్పులు చేశారు. గతంలో లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఒకేసారి ఆగస్టు నెలలోపు చెల్లించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు వ్యాపారులకు ఆర్థిక భారం తగ్గించేలా, ఈ మొత్తాన్ని 6 వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.

మొత్తం లైసెన్స్ (bar licenses)ఫీజు మాత్రం జనాభా ఆధారంగా నిర్ణయించారు.50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్ ఫీజు రూ.35 లక్షలు..50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు..5 లక్షలకు పైగా జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.75 లక్షలుగా ఉంది. ప్రతి ఏటా ఈ లైసెన్స్ ఫీజుపై 10 శాతం పెంపు ఉంటుందని అధికారులు తెలిపారు.

బార్ల నిర్వహణ సమయాన్ని కూడా పెంచారు. గతంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లకు అనుమతి ఉండేది. కొత్త పాలసీలో ఈ సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. ఈ మార్పు బార్ యజమానులకు మరింత వ్యాపార అవకాశాన్ని కల్పించనుంది.

New Bar Policy

గతంలో ఒక బార్ కోసం 27 దరఖాస్తులు రాగా, కొన్ని చోట్ల సిండికేట్లు కొత్తవారిని రాకుండా అడ్డుకునే అవకాశం ఉండేదని, ఈ సమస్యను పరిష్కరించడానికే కొత్త నిర్ణయాలు తీసుకున్నామని ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ పాలసీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 840 బార్లలో 10 శాతం బార్ లైసెన్సులను కల్లు గీత కార్మికుల కులస్తులకు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా ఆ వర్గం వారికి ఆర్థికంగా చేయూత లభిస్తుంది.

కొత్త బార్ పాలసీ(New Bar Policy)కి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 28న లాటరీ ద్వారా బార్లను కేటాయించి, సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి రానుంది. ఎయిర్‌పోర్ట్‌లలో బార్ల లైసెన్స్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Chicken : మీరు రోజూ చికెన్ తినే బ్యాచేనా? అయితే అర్జంటుగా ఆపేయండి

 

Exit mobile version