Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్టైలే వేరు..మాటల మనిషి కాదు చేతల మనిషి

Pawan Kalyan: మొంథా తుపాను కారణంగా కోడూరు సమీపంలోని పంట పొలాలు భారీగా నష్టపోయాయి. ఈ ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ , బాధిత రైతులను నేరుగా చూసి, వారి కష్టాలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల తుని కోమటి చెరువు తుపాను ప్రభావిత ప్రాంతంలో, అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు వద్ద పంట పొలాలను పరిశీలించిన తీరు, రైతులతో మాట్లాడిన విధానం ఆయనకున్న సున్నిత మనస్తత్వం, అలాగే నిజమైన ప్రజా సంబంధాలకు అద్దం పడుతోంది. ఆయన నేరుగా పొలాల్లోకి దిగి, రైతుల వద్దకు వెళ్లి, వారి ఆవేదనను ప్రత్యక్షంగా పంచుకోవడంలో చూపిన శ్రద్ధ, ప్రస్తుతం ఆయన రాజకీయ జీవితానికి గొప్ప పాజిటివ్ ఇమేజ్‌ను తెచ్చిపెడుతోందని పవన్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు.

pawan-kalyan

మొంథా తుపాను కారణంగా కోడూరు సమీపంలోని పంట పొలాలు భారీగా నష్టపోయాయి. ఈ ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) , బాధిత రైతులను నేరుగా చూసి, వారి కష్టాలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. “ప్రతి ఒక్క రైతు ఆరోగ్య పరిరక్షణ, జీవిత బాధ్యత మాపై ఉందని చెబుతూ వారి సమస్యలను వినడం, వారితో ఆయనకు మరింత మమేకం కావడంలో కీలక పాత్ర పోషించింది.దీంతో కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా, సమస్యల వెంటనే పరిష్కారాలు చూపడంపై ఆయన పట్టుదల, ఇతరులతో ఆయనకున్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

pawan-kalyan

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, వెంటనే పరిష్కారాలు కూడా చూపించడం చూసి ప్రతిపక్ష నేతలు సైతం విస్తుబోతున్నారు. కొంతకాలం క్రితం వరకు “పవన్ రాజకీయాలు పనికిరారు” అని విమర్శించిన రాజకీయ విశ్లేషకులు కూడా, ఇప్పుడు ఆయన యొక్క పరిణతిని, నిబద్ధతను అర్థం చేసుకుంటున్నారు.

Pawan Kalyan-with-farmers

డిప్యూటీ సీఎం పదవిని కేవలం ఒక ఆలంకరణగా కాకుండా, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడానికి, అధికార యంత్రాంగాన్ని నడిపించడానికి ఒక శక్తివంతమైన వేదికగా ఆయన ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆయనను కేవలం ఒక పొలిటిషియన్‎గానే కాక, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టే లీడర్‎గా నిరూపిస్తోంది.

pawan-kalyan

జనసేన అధినేతగా, రాజకీయ నాయకుడిగా తన పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తూనే, తన సినిమాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. దీంతోనే “పవన్ లాంటి లీడర్లు ప్రతి సర్కిల్‌లో ఉండాలి” అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుంటోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version