Annadatha Sukhibhava : అన్నదాతల ఖాతాల్లోకి రూ.7,000 జమ… కానీ కొందరికెందుకు రాలేదు?

ఎన్నికల హామీకి నిలుస్తూ, రైతన్నలకు ఊరట నిచ్చింది ఏపీ కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా “అన్నదాత సుఖీభవ (Annadatha Sukhibhava)”

Annadatha Sukhibhava

ఎన్నికల హామీకి నిలుస్తూ, రైతన్నలకు ఊరట నిచ్చింది ఏపీ కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా “అన్నదాత సుఖీభవ” నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర రైతులకు రూ.5,000, కేంద్రం అందించే పీఎం కిసాన్ కింద మరో రూ.2,000 కలిపి మొత్తం రూ.7,000 నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి.

జులై 30న అన్నదాత సుఖీభవ (Annadatha Sukhibhava) నిధులు విడుదల కాగా, మొదటి రోజే 99.98 శాతం రైతుల ఖాతాల్లో డబ్బులు చేరినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 44.75 లక్షల మంది అర్హులైన రైతులకు ఈ సాయం అందింది.

అయితే కొందరికి మాత్రం ఇంకా జమ కాలేదు. బ్యాంక్ ఖాతాలు ఆపరేటివ్ స్థితిలో లేకపోవడం, ఆధార్ అనుసంధానం సమస్యలు, వెబ్ ల్యాండ్ వివరాల్లో తేడాలు, కేవైసీ (KYC issues)పూర్తి కాకపోవడం వంటి సాంకేతిక కారణాలతో కొందరి ఖాతాల్లో డబ్బు పడలేదు.

Annadatha Sukhibhava

అయితే వీరు భయపడక్కరలేదు. ఈ సమస్యలు ఉన్న రైతులు ఆగస్టు 3వ తేదీ నుంచి తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేసి, తప్పులను సరిచేసుకుని అర్హత నిరూపించుకుంటే, ప్రభుత్వం నిధులు ఖాతాల్లోకి జమ చేస్తుంది.

వారసుల పేర్ల్లో ఖాతాలు మారాల్సి ఉన్నవారు, పాసుపుస్తకాల్లో పొరపాట్లు ఉన్నవారు, భూమి వివరాలు ఖచ్చితంగా నమోదు కాకపోయినవారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. బ్యాంక్ ఖాతా యాక్టివ్‌లో లేకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్లి అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

Also Read: MS Bhaskar : 67 ఏళ్ల వయసులో 38 ఏళ్ల ఎదురుచూపు తర్వాత ఒక జాతీయ అవార్డు !

 

Exit mobile version