Ration cards
ఏపీలో పారదర్శకమైన పాలనను అందించే లక్ష్యంతో, కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థలో కీలకమైన మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా, ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ కొత్త కార్డులు (Ration cards)పంపిణీ తేదీలు, జిల్లాల వారీగా పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి మొదటి విడతలో 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది.
Murder:వీడిన కూకట్‌పల్లి మర్డర్ మిస్టరీ..అక్కడ పోలీసులే షాక్ అయ్యేలా ఏం జరిగింది ?
ఈ తొమ్మిది జిల్లాల్లో విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. ఈ విడతలో మొత్తం 53 లక్షల కార్డులు (Ration cards)పంపిణీ చేయనున్నారు. ఇక రెండో విడతలో ఆగస్టు 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో 23.70 లక్షల కార్డులు అందజేస్తారు.
అలాగే మూడవ విడత పంపిణీ సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 23 లక్షల కార్డుల( ration cards)తో జరుగుతుంది.
చివరిగా, నాలుగవ విడతలో సెప్టెంబర్ 15 నుంచి బాపట్ల, పల్నాడు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, మరియు ప్రకాశం జిల్లాల్లో 46 లక్షల కార్డులు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.
ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు(Ration cards) అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. పాత పెద్ద కార్డులతో పోలిస్తే, ఇవి జేబులో సులభంగా ఉంచుకోవడానికి ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి. ఈ కార్డులపై భద్రత కోసం క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీనివల్ల కార్డును సులభంగా స్కాన్ చేయవచ్చు, అనధికారిక మోసాలను నివారించొచ్చు.
అంతేకాకుండా, గతంలో కార్డుపై వివరాలు అస్పష్టంగా ఉండేవి, కానీ ఈ కొత్త కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా, సులభంగా చదివేలా ఉంటాయని అధికారులు తెలిపారు. ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉండటం వల్ల నకిలీ కార్డులకు, ఇతర మోసాలకు అవకాశం ఉండదని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ స్మార్ట్ కార్డులు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకతను పెంచుతాయని అధికారులు తెలియజేశారు.